Kitchenvantalu

Saggubiyyam Dosa Recipe : బ్రేక్ ఫాస్ట్ లో స‌గ్గు బియ్యంతో దోశ‌.. 10 నిమిషాల్లో ఇలా చెయ్యండి

Saggubiyyam Dosa : ఎప్పుడూ ఆనియన్, మసాలా, ఎగ్ దోశ తిని బోర్ కొట్టేవారికి సగ్గుబియ్యం దోశను ట్రై చేయవచ్చు. సగ్గు బియ్యంతో కూడా క్రిస్పీగా, టేస్టీగా దోశలు వేసుకోవచ్చు. పైగా ఇందుకోసం ముందురోజే పిండి రుబ్బి పులియబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. చాలా సింపుల్​గా అప్పటికప్పుడు ఈ సగ్గు బియ్యం దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు. రుచి కూడా చాలా బాగుంటాయి! మరి, ఈ సూపర్ టేస్టీ దోశలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి..

దోశలు తినడానికి రుచిగా ఉన్నా, చెయ్యడానికి చాలా టైమ్ పడుతుంది. పప్పు నా పెట్టుకోవాలి, రుబ్బుకోవాలి, ఒక రోజు ముందు నుంచే ప్రీపేర్ చేసుకోవాలి. ఒక వేళ మీకు ఇన్ స్టెంట్ గా దోశ తినాలి అనిపిస్తే, సగ్గుబియ్యంతో వెంటనే రెడీ చేసేయండి.

కావాల్సిన పదార్ధాలు
సగ్గుబియ్యం – 1 కప్పు
బియ్యం – 1 కప్పు
అల్లం – 1 ఇంచ్
పచ్చిమిర్చి -3
పుల్లని పెరుగు – 1/4కప్పు
కరివేపాకు – 1 రెమ్మ
కొత్తిమీర – కొద్దిగా
ఉప్పు – తగినంత
నూనె – తగినంత

తయారీ విధానం
1.ఇప్పుడు ఒక గిన్నెలోకి సగ్గుబియ్యాన్ని తీసుకుని, అందులోకి నీళ్లు పోసి, రెండు గంటలు నాన బెట్టాలి.
2.మరో గిన్నెలో రెండు గంటల పాటు బియ్యాన్ని కూడా నాన పెట్టుకోవాలి.
3.ఇప్పుడు నాన పెట్టిన సగ్గుబియ్యం, బియ్యాన్ని, విడివిడిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
4. ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చిని మిక్స్ జార్ లో వేసి, మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి.

5. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న , సగ్గుబియ్యం పేస్ట్, రైస్ పేస్ట్, కలుపుకుని, అందులోకి, అల్లం , పచ్చిమిర్చి పేస్ట్, పెరుగు, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, మరియు, తరిగిన ఉల్లిపాయలు వేసుకుని, దోశ కంసిస్టెన్సీలో కలుపుకోవాలి.
6. ఇప్పుడు స్టవ్ దోశ పాన్ పెట్టుకుని, వేడెక్కిన తర్వాత, దోశలా సన్నగా పోసుకోవాలి.
7. కొద్దిగా కొద్దిగా నూనెను యాడ్ చేసుకుంటూ దోశను రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి.
8. అంతే .. సగ్గుబియ్యం దోశ రెడీ.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u