Healthhealth tips in telugu

Weight Loss:బాణ పొట్టతో ఇబ్బందిగా ఉందా…ఈ డ్రింక్ త్రాగితే చాలు..

Belly fat burning foods telugu :శరీరంలో అధికంగా కొవ్వు పెరగటం.. ఆది పొట్ట ప్రాంతంలో పెరుకుపోవటం వలన చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కలుగుతుంది. బాణ పొట్ట అనేది మనలో చాలా మంది ఇబ్బంది పడుతున్న సమస్య. శరీరంలో మిగతా బాగాలు సన్నగా ఉన్నా పొట్ట మాత్రం బాగా ఎత్తుగా ఉండి కాస్త అసహ్యంగా కనపడటమే కాకుండా బయటకు వెళ్లాలన్న చాలా ఇబ్బంది పడతారు.

అంతేకాక బాణ పొట్ట కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఒక డ్రింక్ గురించి తెలుసుకుందాం. ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ డ్రింక్స్ ఉదయం సమయంలో తాగితే మంచిది. మెంతులు బాణ పొట్టను తగ్గించటంలో చాలా బాగా సహాయపడుతుంది.

మనం మెంతుల్ని ఎన్నో రకాల వంటల్లో ఉపయోగిస్తుంటాము. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. వీటిలో న్యూట్రీషియన్స్ సమృద్దిగా ఉంటాయి. వీటిని డైట్‌లో చేర్చుకోవటం వలన బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మన వంటింట్లో దొరికే ముఖ్యమైన పదార్థాలలో ఇది కూడా ఒకటి అనే చెప్పాలి.

మెంతుల్లో ఫైబర్, ఐరన్, విటమిన్ ఎ మరియు విటమిన్ సి అధికంగా ఉండుట వలన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. మెంతులను సూపర్ ఫుడ్ అని చెప్పాలి.మెంతులు ఇన్ సాల్యుబుల్ ఫైబర్ ను కలిగి ఉంటాయి. ఇది జీర్ణ ప్రక్రియని మెరుగు పరచడానికి కూడా ఉపయోగ పడుతుంది. జీర్ణ ప్రక్రియ బాగా సాగితే తీసుకున్న ఆహారం కొవ్వుగా మారదు.

దీని కోసం మీరు రాత్రే మెంతులు తీసుకొని నీళ్ళ లో నానబెట్టండి. మర్చి పోకుండా రూమ్ టెంపరేచర్ వాటర్ మాత్రమే తీసుకోండి. ఈ మెంతులని మీరు రాత్రి నానపెట్టాలి. పూర్తిగా రాత్రి అంతా నాన బెట్టిన తర్వాత దీన్ని నీళ్లలో మారగపెట్టొచ్చు. ఆ తర్వాత వడకట్టేసి తీసుకోండి. ఇలా చేయడం వల్ల మంచి కలుగుతుంది. కొవ్వు కూడా తగ్గి పోతుంది. పైగా దీని వల్ల మీకు జీరో క్యాలరీలు మాత్రమే అందుతాయి.

అలాగే మెంతులను వెగించి పొడిగా చేసుకోవాలి. ప్రతి రోజు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో పావు స్పూన్ మెంతుల పొడిని కలిపి తాగాలి. ఖాళీ కడుపు తో తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కావాలంటే రోజుకి ఒకసారి మాత్రమే కాకుండా రెండు సార్లు కూడా తీసుకోవచ్చు.

పుదీనా ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని మరిగించి వడకట్టి తేనె,నిమ్మరసం కలిపి తాగాలి. ప్ర‌తి రోజు ఉద‌యాన్నే ఈ డ్రింక్ తాగితే. మెటాబాలిజాన్ని వేగవంతం చేసి.పొట్ట చుట్టు కొవ్వును క‌రిగిస్తుంది. పుదీనా ఆకులకు జీర్ణ ఎంజైమ్‌లను ఉత్తేజపరిచే సామర్థ్యం ఉంటుంది. ఇది జీవక్రియను వేగవంతం చేయడంతో పాటు కేలరీలను సమర్థవంతంగా బర్న్ చేయగలదు. దీంతో అధిక బరువును తగ్గించుకోవచ్చు. హెల్తీ వెయిట్ మేనేజ్‌మెంట్ కోసం డిటాక్షిఫికేషన్ అవసరం.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u