Healthhealth tips in telugu

Beetroot benefits:బీట్ రూట్ ని ఇలా తింటున్నారా… అయితే ప్రమాదంలో పడినట్టే

Beetroot Health benefits in telugu : బీట్‌రూట్‌ను తక్కువ అంచనా వేయకుండా… దాని రంగు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో.. అందులోని పోషకాలు అంతకంటే రెట్టింపు ఆరోగ్యాన్ని మన శరీరానికి అందిస్తాయి. బీట్రూట్ ఆరోగ్యానికి మంచిదని మనలో చాలా మంది తింటుంటారు. ముఖ్యంగా రక్తహీనత సమస్య లేకుండా ఉండాలి అంటే బీట్రూట్ తప్పనిసరిగా ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

బీట్ రూట్ లో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యలు తగ్గిస్తుంది. బీట్రూట్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి అయితే బీట్ రూట్ ని లిమిట్ గా తీసుకోవాలి. బీట్రూట్ ఎక్కువగా తీసుకుంటే కొన్ని సమస్యలు వస్తాయి. బీట్ రూట్ లో ఉండే ఆక్సలేట్ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడేలా చేస్తుంది.

పండ్లలో యాపిల్ ఎంత పవర్ ఫుల్‌గా పనిచేస్తుందో. కూరగాయల్లో బీట్‌రూట్ అంత కంటే మెరుగ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా రోజూ బీట్‌రూట్ తింటే.. అనారోగ్యాన్ని బీట్ చేస్తారు. బరువు తగ్గాలన్నా, రక్తహీనత, గుండె సమస్యలను దూరం చేయాలన్నా.. బీట్‌రూట్ తప్పకుండా తినాల్సిందే.

బీట్‌రూట్‌లో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్ ఎ, సిలు ఎదిగే పిల్లలకు తోడ్పడతాయి. పిల్లలు రోజూ ఒక గ్లాస్ బీట్‌రూట్ జ్యూస్‌ తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఆహార నిపుణులు తెలుపుతున్నారు. బీట్‌రూట్ జ్యూస్ వల్ల మెదడుకు రక్త సరఫరా సక్రమంగా జరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది.

రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్‌ తాగితే శరీరంలో కొవ్వు కరుగుతుందని ఆహార నిపుణులు తెలుపుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు రోజూ బీట్‌రూట్ జ్యూస్ తాగడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే బీట్‌రూట్ వల్ల బద్దకం కూడా దరిచేరదట. ఎనర్జీ డ్రింక్‌లతో ఆరోగ్యాన్ని పాడు చేసుకొనే బదులు.. బీట్ రూట్ జ్యూస్ తాగి ఎక్కువ ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని సొంతం చేసుకోండని సూచిస్తున్నారు.

బీట్ రూట్ జ్యూస్‌ను రోజూ తాగితే హైబీపీ తదితర సమస్యలు దూరమవుతాయి. ఎముకల్ని దృఢంగా ఉంచే శక్తి కూడా బీట్ రూట్‌కు ఉంది. గోళ్లు, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. చ‌ర్మాన్ని కాంతివంతం చేయ‌డానికి బీట్‌రూట్ స‌హాయ‌ప‌డుతుంది.

అంతేకాకుండా జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారు బీట్రూట్ తీసుకుంటే సమస్యలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. డయాబెటిస్ ఉన్నవారు బీట్రూట్ ని లిమిట్ గా తీసుకుంటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి అదే ఎక్కువగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. బీట్ రూట్ లో ఉండే మినరల్స్ మన శరీరానికి ఎక్కువ అయితే ఆ ప్రభావం కిడ్నీల మీద పడుతుంది

దాంతో అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి బీట్ రూట్ లిమిట్ గా తీసుకుని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఏదైనా మితంగా తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు లిమిట్ దాటితే సమస్యలు వస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u