Healthhealth tips in telugu

Broccoli Benefits :బ్రకోలీ వారంలో రెండు సార్లు తింటే ఏమి అవుతుందో తెలుసా?

Broccoli Health Benefits in Telugu :బ్రకోలీ గురించి మనలో చాలా మందికి తెలియదు. ఈ మధ్యకాలంలో సూపర్ మార్కెట్స్ లో దొరకటం వలన కొంతమందికి తెలిసింది.బ్రకోలీలో ఉన్న పోషకాలు,ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే అసలు వదిలిపెట్టకుండా తింటారు. వారంలో రెండు సార్లు బ్రకోలీని ఆహారంలో బాగంగా చేసుకుంటే సరిపోతుంది.

బ్రకోలీలో విటమిన్ సి, జింక్, కాపర్, బి విటమిన్లు, ప్రోటీన్, ఫైబర్, పొటాషియం, విటమిన్ కె వంటి సూక్ష్మ పోషకాలు సమృద్దిగా ఉంటాయి. కాల్షియం అయితే పాల ఉత్పత్తుల కన్నా ఎక్కువ మోతాదులో ఉంటుంది.

ఈ కూరగాయ ఆకుపచ్చ రంగులో ఉండటం వలన ఆకుపచ్చని కూరల్లో ఉండే సల్ఫోరాఫేన్ అనే ఫైటోకెమికల్ దీనిలో చాలా సమృద్దిగా ఉంటుంది. ఇది శరీరం నుండి మలినాలను బయటకు పంపుతుంది.

బ్రకోలీలో ఉండే ఇండోల్-3 కార్బినోల్, కెంప్ఫెరాల్ వంటి సమ్మేళనాలు మంట,వాపు నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన డయబెటిస్ ఉన్నవారికి కూడా చాలా మంచిది. దీనిలో ఉండే ఉండే క్వెరెసిటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తూ, గుండె సంబంధ అనారోగ్యాలను దూరం చేస్తాయి.

బ్రోకలీలోని ఫైబర్ జీర్ణాశయంలోని బైల్ యాసిడ్స్‌తో బంధించడంలో సహాయపడుతుంది. ఇది మన శరీరంలోని కొలెస్ట్రాల్‌ను సులభంగా బయటకు పంపుతుంది. ఈ మధ్య జరిగిన పరిశోధన ప్రకారం, బ్రోకలీ రక్తంలోని ఎల్‌డిఎల్-కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని తేలింది.

బ్రోకలీలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి, వీటిని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అని పిలుస్తారు. దీనితో పాటు, బ్రోకలీ ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి కూడా సహాయ పడుతుంది, ఎందుకంటే బ్రోకలీలో సల్ఫోరాఫేన్ అనే రసాయనం ఉంటుంది, ఇది కీళ్ల నాశనానికి కారణమయ్యే ఎంజైమ్‌లను అడ్డుకుంటుంది.

దీనిలో కెరోటినాయిడ్స్ లుటీన్, జియాక్సంతిన్, బీటా-కెరోటిన్ మరియు ఇతర పవర్ ప్యాక్డ్ యాంటీఆక్సిడెంట్లతో కూడా సమృద్ధిగా ఉంటుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచటానికి సహాయపడుతుంది. సీజనల్ గా వచ్చే సమస్యలకు చెక్ పెడుతుంది.

బ్రోకలీలో కాల్షియం మరియు విటమిన్ K రెండూ సమృద్దిగా ఉండుట వలన ఎముకల ఆరోగ్యానికి మరియు బోలు ఎముకల వ్యాధి నివారణకు చాలా బాగా సహాయ పడతాయి. కాల్షియంతో పాటు, బ్రోకలీలో మెగ్నీషియం, జింక్ మరియు ఫాస్పరస్ వంటి ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. అందువల్ల బ్రోకలీ పిల్లలకు, వృద్ధులకు మరియు పాలిచ్చే తల్లులకు చాలా మంచిది.

శరీరంలోని రక్తపోటును నియంత్రించడంలో సహాయపడే ఫైబర్స్, ఫ్యాటీ యాసిడ్‌లు మరియు విటమిన్‌లను కలిగి ఉన్నందున బ్రోకలీ గుండె ఆరోగ్యానికి గొప్పది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. బ్రోకలీ రక్త నాళాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. బ్రకోలీని సరిగ్గా శుభ్రం చేసిన తరువాతే వంటల్లో వాడాలని,బాగా ఉడికించి మాత్రమే వంటల్లో వాడాలని నిపుణులు చెప్పుతున్నారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u