Beauty TipsHealth

Amla For Hair:ఉసిరితో ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది

Amla Hair FAll Tips In Telugu : మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వాతావరణంలో కాలుష్యం వంటి కారణాలతో చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధ పడుతున్నారు. అలాగే చాలా కంగారు పడి మార్కెట్ లో దొరికే నూనెలను వాడుతున్నారు. వాటి ధర కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అలా కాకుండా చాలా తక్కువ ఖర్చుతో మన ఇంటిలోనే ఒక నూనె తయారుచేసుకోవచ్చు.

ఇప్పుడు చెప్పే నూనె చాలా బాగా పనిచేస్తుంది. ఒక క్లాత్ తీసుకొని దానిలో 2 స్పూన్ల ఎండిన ఉసిరి ముక్కలు, అరస్పూన్ కలోంజి గింజలు, అరస్పూన్ మెంతులను వేసి మూట కట్టాలి. ఒక సీసాలో 100 ml ఆవనూనెను పోసి దానిలో ముందుగా తయారుచేసి పెట్టుకున్న మూటను వేసి మూత పెట్టి 3 రోజుల పాటు ఎండలో ఉంచాలి.

ఈ నూనెను వారంలో 2 సార్లు జుట్టుకి పట్టించి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి గంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేస్తే క్రమంగా జుట్టు రాలే సమస్య తాగిపోతుంది. ఆవనూనె,మెంతులు,కలోంజి గింజలు, ఉసిరి లలో ఉన్న పోషకాలు జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా ఆరోగ్యంగా పెరిగేలా ప్రోత్సహిస్తాయి.
fenugreek seeds
ఈ నూనెను దాదాపుగా నెల రోజుల పాటు వాడుకోవచ్చు. ఎండిన ఉసిరి ముక్కలను ఇంటిలో తయారుచేసుకోవచ్చు. ప్రస్తుతం ఉసిరి కాయలు విరివిగా వస్తున్నాయి. ఉసిరికాయలను ముక్కలుగా కట్ చేసి బాగా ఎంబెట్టి నిల్వ చేసుకోవచ్చు. లేదా ఉసిరి ముక్కలు మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి.

ఉసిరిలో ఫైటోన్యూట్రియెంట్లు, విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్దిగా ఉండుట వలన ఆరోగ్యకరమైన రక్త ప్రసరణను నిర్వహించడానికి మరియు రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు పెరగటానికి ప్రేరేపణ ఇస్తుంది. తెల్లజుట్టును నల్లగా మార్చటంలో కూడా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. అంతేకాక యాంటీమైక్రోబయల్ లక్షణాలు కూడా ఉండుట వలన చెమట మరియు మలినాలను తగ్గించడంలో సహాయపడతాయి.

ఇది స్కాల్ప్‌లోని టిష్యూలను రిపేర్ చేయడానికి మరియు జుట్టు పెరుగుదలను పెంపొందించడానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన ఉసిరి చుండ్రును కలిగించే ఫంగస్‌ని తగ్గిస్తుంది మరియు pH స్థాయిని పునరుద్ధరిస్తుంది.

కలోంజిలో ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు (ముఖ్యంగా విటమిన్ బి మరియు విటమిన్ సి) ఉండుట వలన తలకు పోషణ మరియు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ ఉండుట వలన స్కాల్ప్‌ను శాంతపరచడానికి, చుండ్రును తగ్గించడానికి మరియు జుట్టు పెరుగుదలకు ఆటంకం కలిగించే స్కాల్ప్ ఇన్‌ఫెక్షన్‌లను ఎదుర్కోవడంలో సహాయపడతాయి.

కలోంజి ఆయిల్‌లోని యాంటీఆక్సిడెంట్లు ఉండుట వలన ఫ్రీ రాడికల్స్‌తో పోరాటం చేసి జుట్టు పెరుగుదలకు అనుకూలమైన ఆరోగ్యకరమైన స్కాల్ప్ వాతావరణాన్ని ప్రోత్సహిస్తాయి. దాంతో జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u