Tooth Paste For Face:టూత్ పేస్ట్ లో 1 స్పూన్ కలిపి రాస్తే చాలు జిడ్డు,మురికి, సన్ టాన్ 2 నిమిషాల్లో మాయం
How to remove tan from face In Telugu :ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖం మీద నల్లని మచ్చలు,మొటిమలు అన్ని తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. ఈ చిట్కా కోసం కేవలం మూడు ఇంగ్రిడియన్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాం. ఇవన్ని మనకు ఇంటిలో చాలా సులభంగా అందుబాటులో ఉండేవే.
చాలా తక్కువ ఖర్చులో తెల్లని అందమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అయ్యి మంచి పలితాన్ని పొందండి. వాతావరణంలో కాలుష్యం,ఎండలో ఎక్కువగా తిరగటం వంటి కారణాలతో ముఖం మీద సన్ టాన్,మురికి, దుమ్ము, ధూళి పేరుకుపోయి ముఖం నల్లగా కనపడుతుంది. ఇలా కనిపించినప్పుడు మనలో చాలామంది కంగారు పడిపోయి బ్యూటీ పార్లర్ కి వెళ్లి బ్లీచింగ్ చేయించుకుంటారు. ఇలా బ్లీచింగ్ చేయించుకోవటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. .
అలా కాకుండా మన ఇంటిలో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతో చాలా సులభంగా జిడ్డు, మురికి,సన్ టాన్ సమస్యలను తగ్గించుకోవచ్చు. దీని కోసం ఒక బౌల్ లో ఒక స్పూన్ కోల్గేట్ టూత్ పేస్ట్ వేసుకోవాలి. ఈ చిట్కా కోసం తెల్లగా ఉండే ఏ పేస్ట్ అయినా ఉపయోగించవచ్చు. ఆ తర్వాత ఒక స్పూన్ పంచదార, రెండు స్పూన్ల తేనె వేసి బాగా కలపాలి..
ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన ముఖం మీద ఉన్న జిడ్డు, మురికి సన్ టాన్, మృత చర్మ కణాలు అన్ని తొలగిపోయి చర్మం అందంగా తెల్లగా కాంతివంతంగా మారుతుంది. బ్యూటీ పార్లర్ కి వెళ్లి వేలకు వేలు ఖర్చుపెట్టి బ్లీచింగ్ చేయించుకోవలసిన అవసరం లేదు.
ఇలా ఇంటి చిట్కాలు ట్రై చేస్తే చాలా అద్భుతమైన ప్రయోజనాన్ని పొందుతారు. పంచదార ముఖంపై ఒక స్క్రబ్ వలె సహాయపడుతుంది. చర్మంపై మృత చర్మ కణాలను తొలగింస్తుంది. ఇక తేనె విషయానికి వచ్చేసరికి ముఖ చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది. ముఖం కాంతివంతంగా మెరవటానికి సహాయపడుతుంది.
చాలా తక్కువ ఖర్చుతో మన ఇంటిలో ఉండే సహజసిద్దమైన పదార్ధాలతో చాలా సులభంగా సన్ టాన్, మురికి,జిడ్డు వంటి సమస్యలను చాలా సులభంగా తగ్గించు కోవచ్చు. కాస్త ఓపిక,సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. కాబట్టి కాస్త శ్రద్ద పెట్టి ఇటువంటి చిట్కాలను ఫాలో అయ్యి మంచి ఫలితాన్ని పొందండి. పంచదార,తేనే రెండింటిలో ఉన్న పోషకాలు ముఖ సంరక్షణలో బాగా పనిచేస్తాయి. తేనే వాడేటప్పుడు కంపెనీ తేనే కాకుండా ఆర్గానిక్ తేనే వాడితే మంచిది. ఈ విషయన్ని తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u