Healthhealth tips in telugu

Curd With Honey:పెరుగులో ఈ పదార్థాలను కలిపి తింటే ఊహించని ప్రయోజనాలు…అసలు నమ్మలేరు

curd with honey for eating Health benefits in telugu : మనలో చాలామంది ప్రతిరోజు భోజనంలో పెరుగు వేసుకుంటారు. పెరుగు అన్నం తినకపోతే అన్నం తిన్న సంతృప్తి ఉండదు. కొంత మంది పెరుగులో రకరకాల పదార్థాలను వేసి తింటూ ఉంటారు. పెరుగులో కొన్ని పదార్థాలను కలిపి తినకూడదు. కొన్ని పదార్థాలను కలిపి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

పెరుగులో జీలకర్ర పొడి వేసి కలిపి .తీసుకుంటే అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. పెరుగులో కొంచెం పసుపు కొంచెం అల్లం రసం కలిపి తీసుకుంటే శరీరానికి అవసరమైన ఫోలిక్ యాసిడ్ అందుతుంది.

పెరుగులో తేనె కలిపి తీసుకుంటే జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుంటుంది. పెరుగులో పంచదార కలిపి తీసుకుంటే శరీరంలో వేడి తగ్గి అలసట నీరసం వంటివి లేకుండా నూతన ఉత్తేజం వస్తుంది.

పెరుగులో నారింజ రసం కలిపి తీసుకుంటే శరీరానికి అవసరమైన విటమిన్ సి అంది శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలంగా మారటమే కాకుండా కీళ్ల నొప్పులు వంటివి తగ్గుతాయి. పెరుగులో మిరియాలపొడి కలిపి తీసుకుంటే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి మలబద్ధకం వంటి సమస్యలు ఉండవు.

కాబట్టి సాధ్యమైనంత వరకు పెరుగు ప్రతి రోజు ఆహారంలో బాగంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే కొంతమంది పెరుగును తినటానికి అసలు ఆసక్తి చూపరు. పెరుగులో ఉన్న ప్రయోజనాల కారణంగా తినటం అలవాటు చేసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u