Shani Dev:శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపం ఎలా వెలిగించాలో తెలుసా…?
Shani Dev:శని దేవాలయానికి వెళ్తే నువ్వుల నూనె దీపం తప్పనిసరిగా వెలిగిస్తారు. అలాగే తైలాభిషేకం చేస్తారు. నవగ్రహాలలో న్యాయ దేవుడిగా శనీశ్వరుడిని భావిస్తారు. శని సంచారం అనేది ఒక వ్యక్తి మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఏలినాటి శని, అర్థాష్టమ శని, శని మహాదశ అంటూ అనేక రకాలుగా శని ప్రభావం ఉంటుంది. శని కర్మలకు అనుగుణంగా ఫలితాలు ఇస్తాడు. సాదారణంగా ప్రతి ఒక్కరూ శని ప్రభావానికి భయపడతారు.
ఒక వ్యక్తి చేసే పనులను బట్టి శని ఇచ్చే ప్రతిఫలం ఆధారపడి ఉంటుంది. మంచి పనులు చేస్తే జీవితం సాఫీగా సాగిపోతుంది. అదే చెడు పనులు చేస్తే కష్టాలు, దుఃఖంతో నిండిపోతుంది. శని బాధల నుంచి తప్పించుకునేందుకు ఎక్కువగా సూచించే మార్గం శనీశ్వరుడికి తైలాభిషేకం చేయాలని అంటారు. అలాగే శని ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరతాయి.
శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపం ఎలా వెలిగించాలో తెలుసా…శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపం ఎలా వెలిగించాలో తెలుసుకుందాంకొంత మందికి ఏదైనా పని ప్రారంభించినప్పుడు అనుకోని అవాంతరాలు ఏర్పడటం మరియు కొంత మందికి ఏలినాటి శని ప్రభావం ఉండటం చూస్తూ ఉంటాం. అలాగే వివాహ ప్రయత్నాలు కూడా ముందుకు సాగవు. ఎదో ఆటంకం, ఇబ్బందులు వాస్తు ఉంటాయిఅటువంటి వారు ఈ విధంగా చేయాలి.
ప్రతి గుడిలో నవగ్రహాలు ఉంటాయి. ఆ నవగ్రహాల ముందు ప్రతి శనివారం నువ్వులనూనెతో దీపం వెలిగించాలి. అలాగే శనీశ్వరుడుకి బెల్లం అంటే ఇష్టంఅందువల్ల బెల్లంను నైవేద్యం పెడితే శనీశ్వరుని ప్రభావము తగ్గుతుంది.అలాగే నల్లటి గుడ్డలో నల్లని నువ్వులను మూట కట్టి ప్రమిదలో వేసి వత్తులను వేసి దీపం వెలిగించిన శని ప్రభావం తగ్గుతుంది.
అంతేకాక నవ గ్రహాల చుట్టు 9 ప్రదిక్షణాలు చేసి కాళ్ళు చేతులు కడుక్కొని శివాలయం లేదా ఆంజనేయస్వామి గుడికి వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి శనివారం చేస్తూ ఉంటె శని ప్రభావం తగ్గుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ