Kitchenvantalu

Crispy Bhindi Kurkure Recipe:ఇలా వేపితే చిప్స్ కంటే బెస్ట్ గా ఉంటాయి.. బెండకాయ కుర్కురే

Crispy Bhindi Kurkure: పిల్లలకు స్నాక్స్ లో చూడటానికి, రుచికి, వెరటైగా కనిపిస్తేనే, ఇష్టంగా తింటారు. బెండకాయ చీలికలతో, ఇంట్రెస్టింగ్ బిండీ కుర్ కురే చేసి చూడండి.

కావాల్సిన పదార్ధాలు
లేత బెండకాయలు – 400 గ్రాములు
శనగపిండి – 3/4కప్పు
వాము – 1/8టీ స్పూన్
జీలకర్ర – 1/8 టీస్పూన్
బియ్యం పిండి – 2.5 టేబుల్ స్పూన్స్
ఉప్పు – రుచికి సరిపడా
కారం – 1/2టీ స్పూన్
ధనియాల పొడి – 1/2టీ స్పూన్
గరం మసాలా – 1/2టీ స్పూన్
జీలకర్ర పొడి – 1 టేబుల్ స్పూన్
చాట్ మసాలా పొడి – 1/2టీ స్పూన్
నీళ్లు – చెంచా
నూనె – ట్రై చేసుకోవడానికి

తయారీ విధానం
1.లేత బెండకాయలను తొడిమ తీసేసి, మధ్య లోకి చీరుకోవాలి.
2.మధ్యలో ఉన్న గింజలు , నార, తీసేసి, సన్నని చీరికలుగా, పొడవుగా కట్ చేసుకోవాలి.
3. ఒక గిన్నెలోకి శనగపిండిని, మిగిలిన పదార్ధాలు అన్ని, బాగా కలుపుకోవాలి.
4.బెండకాయ ముక్కల్లోకి, ఈ శనగపిండి మిశ్రమం వేసి, ముక్కలుకు కోటింగ్ ఇవ్వాలి.

5. తర్వాత ఒక చెంచా నీళ్లు, ముక్కలపై చల్లి, 10 నిముషాలు రెస్ట్ ఇవ్వాలి.
6.మరిగే నూనెలో బెండకాయ ముక్కలు వేసుకుని, మీడియం ఫ్లేమ్ పై, రెండు నిముషాలు వదిలేయాలి.
7. ఆ తర్వాత హై ఫ్లేమ్ లోకి మార్చుకుని, కరకరలాడేట్టు ఎర్రగా వేపుకుని, జెల్లడలోకి తీసుకోవాలి.
8.తయారైన బెండీ చిప్స్ పై చాట్ మసాలా చల్లుకుంటే, కరకరలాడే భీండీ కుర్ కురే తయార్.