Gas Problem:భోజనం అయ్యాక అరగ్లాస్ తాగితే అర నిమిషంలో పొట్టలో మొత్తం గ్యాస్ పోతుంది
Best Solution for Gas Trouble : ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా మనలో చాలా మంది ఎసిడిటీ,గ్యాస్ సమస్యతో బాధ పడుతున్నారు. ఆహారం తీసుకున్న వెంటనే కడుపులో మంటగా ఉండటం,పుల్లటి తేనుపులు రావడం, గుండె బరువుగా అనిపించడం, వికారం వంటివి గ్యాస్ట్రిక్ ట్రబుల్ లక్షణాలు.
ఈ లక్షణాలు కనిపించినా సరే కొంతమంది పెద్దగా పట్టించుకోరు. ఇలా గ్యాస్ సమస్యను అశ్రద్ద చేస్తే తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. జీవన విధానంతో పాటు ఆహారపు అలవాట్లను కొంత మార్చుకుంటే గ్యాస్ సమస్యకు గుడ్ బై చెప్పవచ్చని డైటీషియన్లు అంటున్నారు. జీర్ణ సంబంద సమస్యలు ఎక్కువ రోజులు ఉంటే అసలు అశ్రద్ద చేయకూడదు.
కడుపులో మంటను తగ్గించేందుకు చాలా మంది లేనిపోని ట్యాబ్లెట్స్, సిరప్ప్ వాడుతూ ఉంటారు. డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తే పర్వాలేదు. కానీ మందుల షాప్ లో అడిగి ఏదో ఒక టాబ్లెట్ కొనేసి వేసుకోకూడదు. సమస్య ప్రారంభంలో ఉంటే ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. గ్యాస్ గా ఉన్నప్పుడూ ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తాగాలి.
అలాగే గ్యాస్,ఎసిడిటీ సమస్య ఉన్నప్పుడు వాము చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వాములో విటమిన్లు, ఫైటో కెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అరస్పూన్ వాము, చిటికెడు ఉప్పు వేసి బాగా కలిపి నోట్లో వేసుకొని నములుతూ ఆ రసాన్ని మింగాలి. ఒక గ్లాసు నీటిలో అరస్పూన్ వాము వేసి మరిగించాలి. మరిగిన వాము నీటిని వడకట్టి స్పీడ్ గా తాగకుండా కాఫీ ,టీ మాదిరిగా కొద్దికొద్దిగా తాగుతూ ఉండాలి.
ఇలా గ్యాస్ సమస్య ఉన్నప్పుడు తాగవచ్చు. అలాగే భోజనం అయ్యాక అరగ్లాసు మోతాదులో వాము నీటిని తాగితే గ్యాస్ నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది. వామును కొద్దిగా వేయించి పొడి చేసుకుని నెయ్యి కలిపి ఈ మిశ్రమాన్ని అన్నంతో కలిపి తీసుకుంటే గ్రాస్ ట్రబుల్ తగ్గిపోతుంది. వాము అనేది ఆహారం బాగా జీర్ణం కావటానికి సహాయపడుతుంది. మీకు వీలును బట్టి వామును వారం రోజుల పాటు తీసుకుంటే గ్యాస్,ఎసిడిటీ వంటి సమస్యలు ఉండవు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.