Beauty Tips

Face Glow Tips:పార్టీకి వెళ్ళే ముందు ఇది రాస్తే 2 నిమిషాల్లో మీ ముఖం తెల్లగా మారిపోతుంది

jaggery and tomato Face Glow Pack : మనలో ప్రతి ఒక్కరు అందంగా తెల్లగా మెరిసిపోవాలని కోరుకుంటారు. ముఖ్యంగా పార్టీలకు,ఫంక్షన్ లకు వెళ్లినప్పుడు ప్రత్యేకంగా కనపడాలని కోరుకుంటారు. దాని కోసం వారు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు. ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే చాలా తక్కువ సమయంలోనే మంచి ఫలితాన్ని పొందవచ్చు.

ఒక బౌల్ లో ఒక స్పూన్ శనగపిండి.ఒక స్పూన్ బెల్లం పొడి,అరస్పూన్ ఆలోవెరా జెల్, రెండు స్పూన్ల టమోటా రసం వేసుకొని బాగా కలపాలి. ముందుగా ముఖాన్ని రోజ్ వాటర్ లో ముంచిన కాటన్ తో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత తయారుచేసుకున్న పేస్ట్ ని ముఖానికి రాసి సగం కోసిన టమోటా ముక్కతో ఒక నిమిషం రబ్ చేయాలి.

అరగంట అయ్యాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేయాలి. ఈ విధంగా పార్టీకి వెళ్ళే ముందు చేసుకోవచ్చు. అలాగే వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే ముఖం మీద మృతకణాలు, నలుపు,పిగ్మీంటేషన్ వంటి అన్నీ రకాల సమస్యలు తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది.
besan
శనగపిండిని చర్మ సంరక్షణలో పూర్వ కాలం నుండి వాడుతున్నారు. ఆలోవెరా జెల్ కూడా చర్మం మీద మృతకణాలను తొలగించి ముఖం మెరిసేలా చేస్తుంది. ఈ వేసవిలో వచ్చే సమస్యలను కూడా తగ్గించటానికి ఈ ప్యాక్ చాలా బాగా సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/