Beauty Tips

Alovera for hair:కలబందతో షాంపూ తయారుచేసి వాడితే జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది

Alovera Shampoo Hair Fall : ఒకప్పుడు తల స్నానం చేయడానికి కుంకుడు కాయలను ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు మనలో చాలామంది కుంకుడు కాయలకు బదులు షాంపూలను ఉపయోగిస్తున్నారు. మార్కెట్లో దొరికే షాంపూలలో కెమికల్స్ ఉంటాయి. వాటి కారణంగా జుట్టుకు హాని కలిగే అవకాశం ఉంది.
kalabanda beauty
కాబట్టి మన ఇంటిలో సహజసిద్ధంగా షాంపూని తయారు చేసుకుని వాడితే జుట్టు రాలే సమస్య, చుండ్రు వంటి అన్ని రకాల సమస్యలు తొలగి పోతాయి. కలబందతో షాంపూ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ లో నాలుగు మందార పువ్వులను తొడిమలు, పిప్పొడి తీసేసి వేయాలి.
curry leaves
ఆ తర్వాత గుప్పెడు కరివేపాకును శుభ్రంగా కడిగి వేయాలి. కలబంద మట్ట తీసుకొని దానిలోని జెల్ లాంటి పదార్థం అరకప్పు వచ్చేలా తీసుకుని వేయాలి. ఆ తర్వాత నాలుగు స్పూన్ల నీళ్లు వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తల కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేసి గంట తర్వాత కుంకుడు కాయతో తలస్నానం చేయాలి.
Hair fall Tips in telugu
లేదంటే ఈ విధంగా కూడా చేయవచ్చు. ఈ మిశ్రమంలో ఒక గ్లాసు నీటిని పోసి బాగా కలిపి వడగట్టాలి. వడగట్టిన తర్వాత వచ్చిన .జ్యూస్ కి సమాన మోతాదులో బేబీ షాంపూ కలపాలి. ఈ షాంపూను గాజు సీసాలో వేసుకుని ఫ్రిజ్లో పెడితే వారం రోజులు వరకు నిల్వ ఉంటుంది. ఈ షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.
hair fall tips in telugu
కరివేపాకు చుట్టూ రాలే సమస్యను తగ్గించడమే కాకుండా తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో కూడా సహాయపడుతుంది. ఇక మందార పువ్వులు జుట్టు నల్లగా అవటానికి, జుట్టు రాలే సమస్య తగ్గించడానికి సహాయపడుతుంది. కలబంద జుట్టుకు మంచి కండిషనింగ్ ఇస్తుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/