Beauty Tips

Cloves for Hair:ఇలా చేస్తే సన్నగా, పలుచగా ఉన్న జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది…జీవితంలో జుట్టు రాలదు

Hair Growth and hair loss Tips in telugu : ప్రస్తుతం జుట్టు రాలే సమస్య ఎక్కువైంది. మారుతున్న పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, పోషకాహార లోపం వంటి ఎన్నో రకాల కారణాలతో జుట్టు రాలే సమస్య కనబడుతుంది. ఈ సమస్య ఆడవారిలోనే కాకుండా మగవారిలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది.
hair fall tips in telugu
ఈ సమస్య పరిష్కారానికి మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడితే పెద్దగా ప్రయోజనం ఉండదు. అదే మన ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు. కాస్త ఓపికగా ఈ చిట్కా ఫాలో అయితే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా నల్లగా పొడవుగా పెరుగుతుంది. ఒక బౌల్లో ఒక స్పూన్ లవంగాలు, రెండు స్పూన్ల మెంతులు వేసుకొని నీటిని పోసి రాత్రంతా అలా వదిలేయాలి.
Eating raw onion with meals health benefits telugu
ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేయాలి. ఆ తర్వాత నానబెట్టి ఉంచుకున్న లవంగాలు, మెంతులను నీటితో సహా వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ని కాటన్ క్లాత్ సాయంతో వడగట్టాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా అప్లై చేసి అరగంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి.
Diabetes tips in telugu
వారానికి ఒకసారి చేస్తూ ఉంటే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉన్న వారు వారంలో రెండుసార్లు చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు.లవంగాలు జుట్టు రాలే సమస్యను తగ్గించడమే కాకుండా తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో కూడా చాలా బాగా సహాయపడుతాయి.
fenugreek seeds Benefits in telugu
మెంతులను పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో వాడుతున్నారు. జుట్టుకు తేమను అందించి మృదువుగా ఉండేలా చేస్తుంది. జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేసి జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ బాగా జరిగేలా చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. జుట్టు పెరుగుదలకు అవసరమైన సల్ఫర్, కేరటిన్ అనేవి ఉల్లిపాయలో సమృద్దిగా ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/