Health Tips:ఈ డ్రింక్ తాగితే శరీరంలో వేడి,నీరసం,నిస్సత్తువ తగ్గటమే కాకుండా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
Mineral rich smoothie recipe at home : శరీరంలో వేడి తగ్గాలన్నా ,అలసట,నీరసం,నిస్సత్తువ లేకుండా ఉషారుగా ఉండాలన్నా. శరీరంలో రోగనిరోధక శక్తి పెరగాలన్నా ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే సరిపోతుంది. ఈ డ్రింక్ తయారుచేయటానికి ముందుగా పావుకప్పు జీడిపప్పును నీటిలో నానబెట్టాలి.
Kharbuja పండును శుభ్రంగా కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి.మిక్సీ జార్ లో Kharbuja ముక్కలు,నానబెట్టిన జీడిపప్పు,ఒక కప్పు కొబ్బరి పాలు, ఒక స్పూన్ తేనె వేసి మిక్సీ చేయాలి. ఈ డ్రింక్ ని గ్లాసు లో పోసి తాగాలి. దీనిలో విటమిన్ A సమృద్దిగా ఉండుట వలన కంటికి సంబందించిన సమస్యలు ఉండవు.
శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అలసట,నీరసం లేకుండా రోజంతా హుషారుగా ఉండేలా చేస్తుంది. పొటాషియం సమృద్దిగా ఉండుట వలన రక్తపోటు నియంత్రణలో ఉండటమే కాకుండా రక్తప్రసరణ ఎటువంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగుతుంది. అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి చాలా మంచిది. గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
ఫోలిక్ యాసిడ్ ఉండుట వలన గర్భిణీ స్త్రీలకు కూడా మంచిది. ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మెదడుకు ఆక్సిజన్ సరఫరా బాగా సాగి ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పడుతుంది. Kharbuja పండులో 92 శాతం నీరు ఉంటుంది. గ్యాస్,ఎసిడిటీ,కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఏమి ఉండవు.
కిడ్నీలో చిన్న చిన్న రాళ్ళను కరిగిస్తుంది. ఈ పండును ఆయుర్వేదంలో ఎక్కువగా వాడమని చెప్పుతూ ఉంటారు. శరీరంలో వేడి,నీరసం,నిస్సత్తువ వంటివి తగ్గించటంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇలా సహజసిద్దంగా తయారుచేసుకున్న డ్రింక్స్ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ డ్రింక్ తాగి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలు పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.