Potato Chips:ఏడాది పొడవునా క్రిస్పీగా ఉండే బంగాళాదుంప చిప్స్
Potato Chips: ముఖ్యంగా చిన్న పిల్లలు చిప్స్ కి ఎంతగా అలవాటు పడ్డారో అందరికి తెల్సిన విషయమే. కాని బయట మార్కెట్స్ లో దొరికే చిప్స్ అంతగా ఆరోగ్యానికి మంచివి కావు. అందుకే పిల్లల కోసం ఇంట్లోనే ఆలు చిప్స్ తయారు చేసి పెట్టారంటే. షాప్స్ లో చిప్స్ జోలికి వెల్లకుండా ఉంటారు.
కావాల్సిన పదార్ధాలు
బంగాళ దుంపలు – తగినన్ని
ఉప్పు – కొద్దిగా
తయారీ విధానం
1.ఆలు చిప్స్ తయారు చేసుకోవడానికి బంగాళదుంపలు కాస్త పెద్ద పరిమాణంలో ఉండేలా చూసుకోవాలి.
2.తీసుకున్న దుంపలను తొక్క తీసివేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.
3.బంగాళదుంపలను స్లైసర్ సాయంతో,లేదంటే చాక్ సాయంతో స్లైస్ లగా కట్ చేసుకోవాలి.
4.స్టవ్ పై బాండీలో నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు యాడ్ చేసి మరగనివ్వాలి.
5.మరుగుతున్న నీళ్లలో కట్ చేసుకున్న బంగాళదుంప స్లైసెస్ ని వేసి 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి.
6.ఒక నిమిషం తర్వాత జల్లి గరిట సాయంతో ముక్కలను బయటికి తీసి ప్లేట్ లో వేసుకోవాలి.
7.ఒక క్లాత్ పై ఉడికిన స్లైస్ లను కనీసం ఒక రోజు వరకు ఆరబెట్టుకోవాలి.
8.మరునాడు ఆరిన ముక్కలను ప్లేట్ లోకి మార్చుకోని ఎండలో పెట్టుకోవాలి.
9.ఎండిన చిప్స్ ని ఎయిర్ టైట్ కంటేనర్ లో స్టోర్ చేసి పెట్టుకోవాలి.
10. అవసరం అనుకున్నప్పుడు నూనెలో ఫ్రై చేసుకోని తినేయడమే..
Click Here To Follow Chaipakodi On Google News