Devotional

Gemstone Astrology:జన్మ రాశిని బట్టి ఏ రత్నం ధరించాలో మీకు తెలుసా ?

Gemstone Astrology:రత్నాలను కొందరు వారి అభీష్టానికి అనుగుణంగా ధరిస్తారు. లేదా వారి కామ్యాన్ని (కోరికని) బట్టి ధరిస్తుంటారు. అలాకాకుండా మీ జన్మరాశికి ఎటువంటి రత్నము ధరించడం మంచిదో తెలుసుకుని ధరిస్తే దానివలన విశేష ఫలితాలను పొందవచ్చును.

1. మేషం మరియు వృశ్చిక రాశుల వారికీ
మేషం మరియు వృశ్చిక రాశులకు అధిపతి కుజుడు. వీరు పగడాన్ని ధరించడం శ్రేయస్కరం.

2. వృషభ మరియు తుల రాశుల వారికి
వృషభ మరియు తుల రాశులకు అధిపతి శుక్రుడు. వీరు పూర్తిగా తెలుపు లేకుండా లేత గోధుమ రంగులోని ముత్యాలను గానీ, వజ్రాన్నిగానీ ధరించవచ్చు.

3. మిథున మరియు కన్యారాశుల వారికి
మిథున మరియు కన్యారాశులకు అధిపతి బుధుడు. వీరు పచ్చను ధరించడం వలన మేలుకలుగుతుంది.

4. కర్కాటక రాశి వారికి
కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. వీరు మంచి ముత్యాలను ధరించడం శ్రేయస్కరం.

5. సింహరాశి వారికి
సింహరాశికి అధిపతి సూర్యుడు ఈ రాశివారు మాణిక్యాన్ని ధరించడం మంచిది.

6. ధనూ రాశి మరియు మీనరాశుల వారికి
ధనూ రాశి మరియు మీనరాశులకు అధిపతి గురువు. ఈ రాశివారు పుష్యరాగాన్ని ధరించడం మేలుచేస్తుంది.

7. మకర కుంభ రాశుల వారికి
మకర కుంభ రాశులకు అధిపతి శని. వారు నీలాన్ని ధరించడం వలన శుభాలను పొందగలరు.

ఇవి కాకుండా ప్రతి రాశివారికీ ఆ సమయం లో గ్రహగతులనుబట్టి, స్థానాధిపతులు మారుతారు. ఇందు కొరకు జన్మకుండలిని, నవాంశను బట్టి జ్యోతిష్యులు రత్నాలను సూచిస్తారు. పైన చెప్పబడిన రత్నాల వివరాలు జన్మ రాశులను బట్టి చెప్పబడ్డాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.