Beauty Tips

Hair Growth Tips:జుట్టు రాలే సమస్యతో విసిగి పోయారా.. ఈ ఆకుతో చెక్ పెట్టండి

Ajwain leaves hair growth Home Remedies:వాము ఆకులో ఉన్న ప్రయోజనాలు ఆరోగ్యానికే కాకుండా బ్యూటీకి కూడా చాలా బాగా సహాయపడతాయి. ముఖ్యంగ్ జుట్టు సమస్యలను చెక్ పెడతాయి.

ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ జుట్టుకి సంబందించిన సమస్యలతో బాధ పడుతున్నారు. ముఖ్యంగా జుట్టు రాలే సమస్య ఎక్కువగా కనపడుతుంది.

ఈ సమస్య రాగానే మార్కెట్ లో దొరికే ఉత్పత్తులను కొనుగోలు చేసి వాడుతూ ఉంటారు. అలా కాకుండా ఇంటిలో సహజసిద్దంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా సమస్య నుండి బయట పడవచ్చు.

ముందుగా నాలుగు వాము ఆకులను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న వాము ఆకు, అర కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక స్పూన్ మెంతులు కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి. దీనిలో ఒక స్పూన్ ఆవనూనె( Mustard oil ), ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలకుండా బలంగా ఆరోగ్యంగా పెరుగుతుంది.

వాము ఆకులో మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన జుట్టు సంరక్షణలో సహాయపడుతుంది. కాబట్టి ఈ ప్యాక్ వేసుకొని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు రాలే సమస్య నుండి బయట పడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ