Kitchenvantalu

Poha Kachori Recipe:అటుకులతో కొత్తగా ఇలా కచోరి చేస్కోండి.. చాలా బాగుంటుంది

Poha Kachori:అటుకులతో ఇలా కొత్తగా చేసుకోండి క్రిస్పీ గా టేస్టీ గా వస్తాయి..అటుకులతో ఎన్నో రకాలు తయారుచేసుకుంటాం. ఈవినింగ్ స్నాక్స్ కోసం పర్ ఫెక్ట్ గా సూటయ్యే కచోరీలు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు.అటుకులు,లేదా రైస్ బంగాళదుంపలతో పోహా కచోరీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
బియ్యం లేదా అటుకులు – ½ కప్పు
ఉప్పు – ¾ టీ స్పూన్
ఆలీవ్ ఆయిల్ – 2 టీ స్పూన్స్
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
ఉడికించిన బంగాళదుంపలు – 3
ఉల్లిపాయలు – 2
పచ్చిమిర్చి – 2
ఉడికించిన పచ్చి బఠానీలు – ½ కప్పు
కొత్తిమీర – ½ కప్పు
ధనియాల పొడి – ½ టీస్పూన్
జీలకర్రపొడి – ¼ టీ స్పూన్
పసుపు – ¼ టీ స్పూన్
చాట్ మసాలా – ¼ టీ స్పూన్

తయారీ విధానం
1.ముందుగా బియ్యాన్ని కడిగి నాన బెట్టుకోని జల్లెడలో వడగట్టుకోవాలి.
2.ఇప్పుడు కచోరీ కోసం ఉడికించిన బంగాళదుంపలను మాష్ చేసుకోవాలి.
3.మిక్సింగ్ బౌల్ లోకి బంగాళదుంప గుజ్జును తీసుకోని అందులోకి ఉల్లిపాయ తరుగు,పచ్చిమిర్చి తరుగు,కారం,ఉప్పు,ధనియాలపొడి,జీలకర్ర పొడి,పసుపు ,చాట్ మసాలా వేసి అన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి.

4.నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సిజార్ లో గ్రైండ్ చేసుకోవాలి.పిండిలోకి ఆలివ్ ఆయిల్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
5.పిండి ముద్దను కొద్ది కొద్దిగా తీసుకోని అరచేతిలో వేసుకోని చిన్నగా స్ప్రెడ్ చేసుకోని అందులోకి తయారు చేసుకున్న బంగాళదుంప స్టఫ్ పెట్టుకోని ఎడ్జ్ లను క్లోజ్ చేసి కచోరీలా వత్తుకోవాలి.
6.తయారు చేసుకున్న కచేరీలను డీప్ ఫ్రై చేసుకుంటే పోహా కచోరీ రెడీ.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ