Beauty Tips

Dandruff:చుండ్రు సమస్యతో విసిగిపోయారా..ఎన్ని చేసినా వదలటం లేదా…ఇలా చేస్తే చాలు..

Dandruff Home remedies in telugu:చుండ్రు ప్రారంభ దశలో ఉన్నప్పుడే చిట్కాలను ఫాలో అయితే చాలా సులభంగా తొలగించుకోవచ్చు. చుండ్రు సమస్యకు ఇప్పుడు చెప్పే చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. జుట్టు రాలటానికి చుండ్రు కూడా ఒక కారణం.

చుండ్రు అనేది ఒక్కసారి వచ్చిందంటే అంత తొందరగా వదలదు. చుండ్రు కారణంగా జుట్టు రాలే సమస్య కూడా వస్తుంది. ఈ సమస్యలను తగ్గించుకోవటానికి ఇంటి చిట్కాలు బాగా సహాయపడతాయి. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

చుండ్రు సమస్య అనేది తొందరగా తగ్గదు. మనలో చాలా మంది చుండ్రు సమస్య వచ్చినప్పుడు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి విసుగు చెంది ఉంటారు. అలాంటి వారు ఈ చిట్కా ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది. మార్కెట్ లో దొరికే ఎటువంటి ప్రొడక్ట్స్ వాడవలసిన అవసరం లేదు.

ఒక బౌల్ లో నాలుగు స్పూన్ల పెరుగు, అరచెక్క నిమ్మరసం,ఒక స్పూన్ ఆవనూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు…అలాగే తల మాడుకు బాగా పట్టించి అరగంట తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే క్రమంగా చుండ్రు సమస్య తగ్గుతుంది.

పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం, నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్, ఆవనూనెలో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు తల మీద చుండ్రు లేకుండా చేయటానికి బాగా సహాయపడతాయి. అలాగే తల మీద చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండేలా కెఃస్తుంది. ఈ చిట్కా కోసం ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ మనకు సులువుగానే లభ్యం అవుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ