Almonds:బాదం డైరెక్ట్ గా తినాలా… నానబెట్టి తినాలా…అధిక బరువు ఉన్నవారు బాదం పప్పు తినవచ్చా…?
Almonds Health benefits in telugu :బాదం పప్పు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో మనకు తెలిసిన విషయమే. అయితే చాలా మందికి బాదం పప్పు నానబెట్టి తినాలా లేదా మామూలుగా తినాలా, బాదం పప్పులను వెగించి ఉప్పు,కారం యాడ్ చేసి తీసుకోవచ్చా అనే సందేహాలు వస్తూ ఉంటాయి. బాదం పప్పును ఎలాగైనా తీసుకోవచ్చు.
బాదం పప్పును ఒక పవర్ హౌస్ గా చెప్పవచ్చు. ఎందుకంటే బాదంలో కార్బో హైడ్రేడ్స్,ప్రోటీన్స్,ఫైబర్,ముఖ్యమైన ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్ సమృద్దిగా ఉంటాయి. బాదం పప్పు చిన్నగా ఉన్నా ఎన్నో పోషకాలతో నిండి ఉంటుంది. డైటింగ్ చేసేటప్పుడు కూడా బాదం పప్పును తీసుకోవచ్చు. బాదం పప్పు తినటం వలన మెమొరీ పెరుగుతుంది. అంతేకాక నేర్వస్ సిస్టమ్ కి, జీర్ణ వ్యవస్థ కి ఎంతో సహాయపడుతుంది. అలాగే బాదం పప్పు తింటే బాదం లో ఉండే ఫ్యాట్ కారణంగా బరువు పెరుగుతామా అనే సందేహం కూడా ఉంటుంది.
బాదం పప్పు తినటం వలన బరువు పెరిగే అవకాశం లేదు. ఎందుకంటే బాదం పప్పులో ఉండే మంచి ఫ్యాట్ బరువు తగ్గటానికి సహాయపడుతుంది. బాదం పప్పును ఎలా తీసుకోవాలంటే బాదం పప్పును నానబెట్టి తీసుకోవచ్చు లేదా డైరెక్ట్ గా అయిన తినవచ్చు. బాదం పప్పును క్రష్ చేసి సలాడ్, ఫ్రూట్స్ ముక్కల మీద లేదా కూరల మీద జల్లుకొని ఎలాగైనా తీసుకోవచ్చు. బాదం పప్పులు మన వయస్సు,బరువును బట్టి ఎన్ని తీసుకోవాలో అనేది ఆదారపడి ఉంటుంది.
అయితే బాదం పప్పును ఏ సమయంలో తీసుకొంటే మంచిది అనే విషయానికి వస్తే చాలా మండి బాదం పప్పును నానబెట్టి ఉదయం తీసుకుంటే మంచిదని భావిస్తారు. అవును అది కరెక్ట్. ఉదయం బాదం పప్పును తీసుకుంటే ఉదయం సాలిడ్ అయిటమ్ తీసుకున్నట్టు అయ్యి ఉదయం బ్రేక్ ఫాస్ట్ ప్రారంభించినట్టు అవుతుంది. అప్పుడు మెటబాలిజం ఏక్టివిటీ ని ప్రారంభిస్తుంది. బాదం పప్పును నానబెట్టి తీసుకోవటం వలన సులభంగా జీర్ణం అవుతుంది.
అలాగే చాలా మండి బాదం నానబెడితే ఫ్యాట్ తగ్గుతుందని భావిస్తారు. కానీ రా బాదంలో ఎంత ఫ్యాట్ ఉంటుందో నానబెట్టిన బాదంలో కూడా అంతే ఫ్యాట్ ఉంటుంది. కొంతమందికి బాదం పప్పు తింటే ఎలర్జీ వస్తుంది. అలాంటివారు బాదం పప్పును నానా బెట్టి తింటే ఎలర్జీ కలిగించే కారకాలు తొలగిపోతాయి. కాబట్టి ఎవరైనా సరే నానబెట్టిన బాదం పప్పును తింటే ఎలాంటి సైడ్ ఎఫెట్స్ ఉండవు. నానబెట్టిన బాదం పప్పు తొక్కతో తింటే మన శరీరానికి ఫైబర్ అందుతుంది.
బాదం పప్పును ఏ వయస్సు వారు తినవచ్చు అనే విషయం గురించి కూడా చాలా మందికి సందేహాలు ఉంటాయి. చిన్న పిల్లలు అయితే వారికి సాలిడ్ ఫుడ్ పెట్టినప్పుడు నుంచి బాదం పప్పును పొడి చేసి పాలలో కలిపి ఇవ్వవచ్చు. అన్నీ వయస్సులవారు బ్దంబాదం పప్పులను తినవచ్చు. రోజుకి 5 నుంచి 7 బాదం పప్పుల వరకు తీసుకోవచ్చు. అయితే ఎన్ని తీసుకోవాలో అనేది వయస్సు,బరువుని బట్టి ఉంటుంది. బాదం పప్పులు తినే ముందు ఎన్ని తినాలో డాక్టర్ సలహా తీసుకోవటం మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ