Saggubiyyam Punugulu:నోరూరించే సగ్గుబియ్యం చల్ల పునుకులు.. రుచి ఎప్పటికి మర్చిపోరు
Saggubiyyam Punugulu: సగ్గుబియ్యంతో పరమాన్నం చేసుకుంటాం. స్వీట్ అంటే ఇష్టం లేనివారు ఇలా punugulu వేసుకుంటే చాలా బాగుంటాయి. ఒక్కసారి తింటే అసలు వదిలిపెట్టకుండా తింటారు. కరకరలాడే స్నాక్స్ తినాలనిపిస్తే.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోగలిగే ఓ సింపుల్ రెసిపీ ఉంది. అదే సగ్గుబియ్యం పునుగులు..
చల్లని వాతావరణంలో ఈవినంగ్ స్నాక్స్ లా, మిరపకాయ బజ్జీలు, పకోడీలే కాదు. అప్పుడప్పుడు, మన ట్రేడీష్నల్ ఫుడ్ ,సగ్గుబియ్యం బోండాలు ట్రై చేయండి.
కావాల్సిన పదార్థాలు
సగ్గుబియ్యం – 3/4కప్పు
పుల్లటి పెరుగు – 1 కప్పు
నీళ్లు – 1/2కప్పు
ఉప్పు – రుచికి సరిపడా
ఉల్లిపాయ తరుగు – 1/4కప్పు
పచ్చిమిర్చి – 2 టేబుల్ స్పూన్స్
జీలకర్ర – ½ టేబుల్ స్పూన్
బియ్యం – 1/4కప్పు
అల్లం తురుము – ¼ టేబుల్ స్పూన్
కొత్తిమీర కొద్దిగా
తయారీ విధానం
1.సగ్గుబియ్యంలో నీళ్లు, పెరుగు, కలిపి ఐదు గంటలు నానపెట్టుకోవాలి.
2. ఐదు గంటల తర్వాత, నానిన సగ్గుబియ్యం లోకి, మిగిలిన పదార్ధాలు అన్ని వేసి బాగా కలుపుకోవాలి.
3.అవసరం అయితే కొద్దిగా నీళ్లు చిలకరించుకుని, పిండి కాస్త చిక్కగా కలుపుకోవాలి.
4.ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకుని, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, వేడెక్కనివ్వాలి.
5. చేతులు తడి చేసుకుని, పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని పునుగుల మాదిరిగా నూనెలో వేసుకోవాలి.
6.స్టవ్ మీడయం ఫ్లేమ్ పై పెట్టుకుని, తిప్పుతూ, బోండాలను, ఎర్రగా కాల్చుకుని, బయటికి తీసుకోవాలి.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ