Barnyard Millet:గుప్పెడు గింజలను ఇలా తింటే డయాబెటిస్,చెడు కొలెస్ట్రాల్, రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు
Barnyard Millet Benefits In Telugu : ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి పరిస్థితి కారణంగా మనలో చాలా మంది ఆరోగ్యం పట్ల శ్రద్ద పెరిగి మంచి ప్రోటీన్ మరియు పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవటం ప్రారంభించారు. ముఖ్యంగా సిరి ధాన్యాలను ఎక్కువగా తీసుకుంటున్నారు.
సిరి ధాన్యాల్లో ఒకటైన ఊదలలో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చాలా తక్కువ ఖర్చులో మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.ఊదలు చాలా సులభంగా జీర్ణం అవుతాయి. చాలా బలవర్ధకమైన ఆహారం. కేలరీలు చాలా తక్కువగా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.
ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. ఊదలలో కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. అలాగే నెమ్మదిగా జీర్ణమవుతుంది. అంతేకాక తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండుట వలన డయాబెటిస్ ఉన్న వారికి మంచి ఆహారం అని చెప్పవచ్చు.
డయాబెటిస్ ఉన్నవారు ప్రతి రోజు వీటిని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అధిక మొత్తంలో ఇనుము ఉండుట వలన రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. ఈ సమస్యతో బాధపడే వారు ప్రతి రోజు వీటిని తింటే రక్తంలో హీమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య తగ్గుతుంది.
ఈ ఆహరం శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతుంది. ఊదలు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. శారీరక శ్రమ లేకుండా ఎక్కువ సేపు కూర్చుని పనిచేసే వారికి ఊదలు చాలా మంచి ఆహరం. కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి రక్త ప్రవాహం బాగా సాగేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
అధిక బరువు సమస్యతో బాధపడేవారు భోజనంనకు బదులుగా ఊదలను తింటే బరువు తగ్గుతారు. ఊదలను తినటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంది. ఊదలతో ఉప్మా, ఇడ్లీ, కిచిడీ, ఫ్రైడ్ రైస్, దోసె, పాయసం వంటి ఎన్నో రకాల వంటలను చేసుకొని వాటిలో ఉన్న ప్రయోజనాలను పొందవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ