Kitchenvantalu

Ragi Dosa: రాగి దోశ కోసం పిండి ఇలా చేసుకొంటే దోశలు హోటల్ లో లా వస్తాయి…

Ragi Dosa:రాగి దోశ కోసం పిండి ఇలా చేసుకొంటే దోశలు హోటల్ లో లా వస్తాయి…ఇది శక్తివంతమైన అల్పాహారం.. రాగి దోశ ఎంతో ఆరోగ్యకరం..ఎప్పుడూ రుచులే కాదండీ, రుచితో పాటు ఆరోగ్యం కూడా, మ్యానేజ్ చేసుకోవాలి. నోటికి కమ్మగా బాడీకి హెల్తీగా, పని చేసే రాగి రవ్వ దోశ, ఎలా చేసుకోవాలో చూసుకోండి.

కావాల్సిన పదార్ధాలు
రాగి పిండి – 1 కప్పు
బొంబాయి రవ్వ – 1 కప్పు
గోధుమ పిండి – 1/3కప్పు
ఉప్పు – తగినంత
కరివేపాకు – 2 రెమ్మలు
ఇంగువ – చిటికెడు( ఆప్షనల్)
మిరియాల పొడి – 1 టేబుల్ స్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
పచ్చిమిర్చి తరుగు – 2 టీ స్పూన్స్
పల్చని మజ్జిగ- 1 లీటర్
నీళ్లు – 1/2లీటర్
నూనె – దోశ కాల్చడానికి
ఉల్లిపాయ తరుగు – కొద్దిగా

తయారీ విధానం –
1.ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లోకి రాగి పిండి, బొంబాయ రవ్వ, గోధుమపిండి, వేసుకుని,మజ్జిగ కలిపి,
అందులోకి పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర,ఇంగువ, కరివేపాకు, మిర్యాల పొడి, అన్ని వేసుకుని , బాగా మిక్స్ చేసి 10నిముషాలు పక్కనపెట్టాలి.
2.10 నిముషాల తర్వాత నీళ్లు కలుపుకుని, పల్చగా చేసుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ దోశ పెనం పెట్టుకుని, కొద్దిగా నూనె వేసుకుని దానిపై, సన్నగా తరిగిన ఉల్లిపాయలు చల్లుకోవాలి.
4. చల్లుకున్న ఉల్లిపాయలపై పల్చని రాగి పిండిని పెనం అంతటా పల్చగా పోసుకోవాలి.
5. దోశ కాస్త ఎర్ర బడుతుండగా, అంచులపై నూనె వేసి ఎర్రగా కాల్చిన తర్వాత, తిప్పేసుకోవాలి.
6. అంతే రెండు వైపుల కాల్చుకుని, ప్లేట్ లోకి తీసుకోవడమే.
Click Here To Follow Chaipakodi On Google News