Nervous Weakness:నరాల బలహీనతని తగ్గించి మీ శరీరంలో ఉన్న ప్రతి నరంలో బలాన్ని పెంచే B Complex లడ్డు
Nervous Weakness Remedy : మనం తీసుకొనే ఆహారం మన ఆరోగ్యం మీద కీలకమైన ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి ఆహారంలో మంచి పోషకాలు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ఏ సమస్యలు లేకుండా ఉంటుంది.
నరాల బలహీనత అనేది ఈ రోజుల్లో చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తుంది. నరాల బలహీనత సమస్య వస్తే అసలు అశ్రద్ద చేయకుండా డాక్టర్ ని సంప్రదించి ఆ సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే లడ్డు తింటే నరాల బలహీనత సమస్య తగ్గి శరీరంలో ప్రతి నరంలో బలాన్ని పెంచుతుంది.
ఈ లడ్డు కోసం ఒక కప్పు తవుడు ముకుడులో వేసి ఒక స్పూన్ నెయ్యి వేసి వేగించి పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఒక కప్పు ఖర్జూరంను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఖర్జూరం గట్టిగా ఉంటే వేడి నీటిలో నానబెట్టాలి. ముకుడులో ఒక కప్పు బెల్లం, నీటిని పోసి తీగ పాకం వచ్చాక తవుడు,ఖర్జూరం పేస్ట్ వేసి బాగా కలపాలి.
రెండు నిమిషాలు పొయ్యి మీద ఉంచి ఆ తర్వాత పొయ్యి మీద నుండి దించి చిన్న చిన్న లడ్డు లుగా చేసుకోవాలి. ప్రతి రోజు ఒక లడ్డు తింటే శరీరానికి అవసరమైన బి కాంప్లెక్స్ విటమిన్ బాగా అంది నరాల బలహీనత తగ్గుతుంది. ఈ లడ్డు తింటే శరీరంలో బలహీనత తగ్గి నీరసం,నిసత్తువ,అలసట తగ్గి హుషారుగా ఉంటారు.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. శరీరానికి మంచి పోషకాలను అందించటమే కాకుండా బరువు తగ్గటానికి కూడా సహాయపడుతుంది. అలాగే కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు వంటివి తగ్గటానికి కూడా సహాయపడుతుంది. కిడ్నీలో రాళ్ళను కరిగించటానికి సహాయపడుతుంది. అలాగే శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచుతుంది.
రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటాం. కాస్త శ్రద్ద పెట్టి సమయాన్ని కేటాయిస్తే చాలా తక్కువ ఖర్చులో మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి రోజు ఒక లడ్డు తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ