Palmistry For Thumb:బొటన వేలును బట్టి మీరు ఎలా ఉంటారో చెప్పవచ్చు….ఎలా ?
Palmistry For Thumb :మనిషి చేతిలోని బొటన వేలు చాలా గొప్పదైనది. దీని గొప్పదనం తెలుసుకునే అర్జునుని గురువైన ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలును గురుదక్షిణగా స్వీకరించాడు. దీంతో అర్జునుడిని మించిన విలువిద్యకారుడు ప్రపంచంలో మరెవ్వరూ లేరంటే అతిశయోక్తికాదు. బొటన వేలుకు మెదడుకు సంబంధం ఉంది. ఎందుకంటే మనిషి చేయాలనుకున్న ప్రతి పనికూడా మెదడునుంచే సంకేతాలు అందుతాయి. కాబట్టి మనిషి బొటన వేలును చూసి ఆ మనిషియొక్క స్వభావం, గుణగణాలు, అతని అలవాట్లు తదితరాలను చెప్పవచ్చంటున్నారు జ్యోతిష్యులు.
ఒక్కొకరి వెళ్ళు ఒక్కో రకంగా ఉంటాయి. కొందరివి సన్నగా ఉంటాయి, కొందరివి లావుగా ఉంటాయి.. అలానే పొట్టిగా, పొడవుగా కూడా ఉంటాయి. ప్రపంచంలో ఏ ఒక్కరి వేలిముద్రలు ఒకేలా ఉండవు. చేతి రాతలు బట్టి జాతకాలు చెబుతారు. వాటిని కొందరు నమ్ముతారు… కొందరు కొట్టి పారేస్తారు.
అలాగే చేతి బొటన వెల్లని బట్టి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చట. కొందరి బొటనవేలు నిటారుగా ఉంటాయి… మరి కొందరిది కొద్దిగా వంగి ఉంటాయి. వీటిని బట్టి అ వ్యక్తి ఎలాంటి వారో తెలుసుకోవచ్చట. మరింకెందుకు ఆలస్యం? మీరు కూడా చదివేయండి!
మీ బొటనవేలు కొద్దిగా వంగి ఉందంటే మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవడంలో ముందుంటారని అర్ధం. ఆలోచనలను వ్యక్తపరచడంలో ఏమాత్రం మొహమాటపడరు. మీ మెదడు ఎల్లప్పుడూ చురుకుగా పనిచేస్తుంది. ఎదుటి వారిని గుడ్డిగా నమ్మేస్తారు. మంచి చమత్కారులు. మీ తోడుని ఇతరులు ఇష్టపడతారు.
మీ బొటనవేలు నిటారుగా ఉందంటే మీరు కోపిష్టి అని అర్ధం. ఇలాంటి వారికి తక్కువగా ఆకర్షితులవుతారు. వీరు ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం కలిగిఉంటారు. వీరి లిమిట్స్ వీరికి బాగా తెలుసు. ఎవరికీ ఎక్కువ చనువు ఇవ్వరు. వీలైనంతవరకు అనవసరమైన విషయాల్లో తల దూర్చరు. ఎదుటి వారిని సులభంగా అంచనా వేయగలరు. దుష్టులకు దూరంగా ఉండడంలో వీరు నెంబర్ 1.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ