Pregnancy food :గర్భధారణ సమయంలో కివి పండు తింటే ఏమి జరుగుతుందో తెలుసా…
Amazing Benefits Of Kiwi Fruits During Pregnancy in Telugu :ప్రెగ్నెన్సీ స్త్రీలకు ఒక ఫ్రూట్ అమృతంలా పని చేస్తుంది. ఈ ఫ్రూట్ ను రోజుకు ఒకటి లేదా రెండు తింటే చాలు కావాల్సిన పోషకాలు కడుపుతో ఉన్న మహిళకు అందుతాయి. పిండం పెరుగుదలలో కూడా ఈ ఫ్రూట్ ముఖ్యపాత్రను పోషిస్తుంది. గర్భధారణ సమయంలో తీసుకోవలసిన ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరికి ఎన్నో అనుమానాలు ఉంటాయి. ఈ రోజు గర్భధారణ సమయంలో కివి పండు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.
కివి పండులో విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ ఇ, పొటాషియం, ఫోలేట్, డైటరీ ఫైబర్, కాపర్, కోలిన్, మెగ్నీషియం, ఫాస్పరస్ సమృద్ధిగా ఉంటాయి. పోలేట్ సమృద్ధిగా ఉండటం వలన పుట్టబోయే బిడ్డలో నాడీ లోపాలు లేకుండా చేస్తుంది. శిశువు యొక్క ముఖ్యమైన అవయవాల అభివృద్ధికి కూడా సహాయపడుతుంది.
పుట్టుకతో వచ్చే వైకల్యాలు లేకుండా చేస్తుంది. విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల ఫ్రీరాడికల్స్ యొక్క హానికరమైన ప్రభావాలు నుండి రక్షిస్తుంది. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. గర్భధారణ సమయంలో మలబద్ధకం సాధారణంగా ఉంటుంది. దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన మలబద్దకం సమస్య లేకుండా చేయడమే కాకుండా జీర్ణక్రియ బాగా సాగేలా చేస్తుంది.
కివి పండులో ఆక్టినిడిన్ సమృద్దిగా ఉంటుంది. ఇది మన శరీరంలోని ప్రోటీన్‌ను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడే ప్రోటీయోలైటిక్ ఎంజైమ్. ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచి జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. కివి పండులోని సెరోటోనిన్ మంచి నిద్రకు సహాయపడి నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది.
ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య లేకుండా ఉంటుంది. కాల్షియం సమృద్ధిగా ఉండటం వల్ల ఎముకలు కండరాలు పళ్ళు గుండె గుండె యొక్క అభివృద్ధికి సహాయపడుతుంది. అదే సమయంలో డిప్రెషన్ ఒత్తిడి అలసట అనేవి ఉండవు. రోజుకి ఒక కివి పండు తింటే సరిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ