Dandruff Remedy:చలికాలంలో చుండ్రుతో ఇబ్బంది పడుతున్నారా..
Dandruff Home remedies:చుండ్రు సమస్య ఉన్నప్పుడు ప్రారంభ దశలో చిట్కాలను ఫాలో అయితే చాలా సులభంగా చుండ్రు సమస్య నుండి బయట పడవచ్చు.
ఈ మధ్య కాలంలో జుట్టుకి సంబందించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా చలికాలంలో ఎక్కువగా వస్తాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. చుండ్రు సమస్య వచ్చినప్పుడు అసలు కంగారు పడవలసిన అవసరం లేదు.
చుండ్రు సమస్య అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. చుండ్రు సమస్యను అశ్రద్ద చేస్తే ఎన్నో సమస్యలకు కారణం అవుతుంది. ముఖ్యంగా జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువ అవుతుంది. మన ఇంటిలో ఉండే సహజసిద్దమైన పదార్ధాలతో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.
శనగపిండి:
ఒక కప్పు పెరుగులో నాలుగు స్పూన్ల శనగపిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని గడ్డలు లేకుండా కలపి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఆ తర్వాత ఈ పేస్ట్ ను వెంట్రుకల మొదళ్ల నుంచి చివళ్ల దాకా బాగా పట్టించాలి. అరగంటసేపు ఆరనిచ్చి తలస్నానం చేయాలి. ఇలా కొన్ని వారాల పాటు చేసినట్లయితే చుండ్రు ఏ మందులూ లేకుండానే క్రమంగా తగ్గిపోతుంది.
మెంతులు, పెరుగు పేస్ట్
మెంతులను ముందురోజు రాత్రి పెరుగులో నానబెట్టి ఉదయం మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా చేసుకుని వెంట్రుకలకు బాగా పట్టించాలి. మెంతులు,పెరుగు చుండ్రు నివారణలో చాలా బాగా పని చేస్తాయి. పురాతన కాలం నుండి మెంతులు, పెరుగును జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. చుండ్రు సమస్యను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
గోరింటాకు
గోరింటాకును కోసిన వెంటనే రసం తీసి తలకు పట్టించినట్లయితే చుండ్రు నివారణ అవుతుంది.అందులో ఆమ్ల (పెద్ద ఉసిరి) పొడిని కూడా కలిపితే మరింత మంచి ఫలితం వస్తుంది. గోరింటాకు తెల్లజుట్టును నల్లగా మార్చటంలో కూడా సహాయపడుతుంది.
ఉసిరికపొడి
ఉసిరిక పొడిని అన్ని ఆయుర్వేద షాపుల్లో అమ్ముతారు. ఉసిరిక పొడిని తీసుకోని దానిలో నిమ్మరసం కలిపి మెత్తని పేస్ట్‌లా చేసుకుని తల కుదుళ్లకు పట్టించాలి. ఆ తర్వాత తల మసాజ్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒక సారి చేసినట్లయితే తొందరగా తలలో ఉండే చుండ్రు నివారణ అవుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ