Devotional

Devotional News : కుడి కాలు ముందు అనడం వెనుక అసలు సీక్రెట్ అదేనా ?

Devotional News : కుడి కాలు ముందు అనడం వెనుక అసలు సీక్రెట్ అదేనా.. సంప్రదాయాలు, పద్దతులు అనేవి ఎప్పటి నుంచే మన పూర్వీకులు పాటిస్తూ వస్తున్నారు. కొందరు వాటిని మూఢనమ్మకాలు అని కొట్టేపారేసిన కానీ ఆ సంప్రదాయాలకు, పద్దతులకు ఒక విలువ ఉంది. జ్యోతిష్యం ప్రకారం, వాస్తు ప్రకారం పలు సాంప్రదాయాలను ఫాలో అప్పట్లో ఫాలో అయ్యారు.

ఇప్పటికీ కూడా వాటిని ఫాలో అవుతున్న కొందరికి అసలు ఆ పని ఎందుకు చేస్తామో తెలీదు. ఉదాహరణకు హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా మంచి పనులు చేసేటప్పుడు, కొత్తగా పెళ్లైన అమ్మాయి తన అత్తారింట్లో మొదటిసారి అడుగు పెట్టేటప్పుడు కుడికాలు లోపలికి పెట్టి వెళ్తారు

మన సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలను చాదస్తంగా కొందరు కొట్టిపారేస్తుంటారు. అయితే ఇందులో కొన్ని ఆరోగ్య రహస్యాలు, శాస్త్రీయత ఉన్నాయని అంటుంటారు. కొన్ని మూఢ నమ్మకాలు ఉన్నప్పటికీ చాలా వరకూ చాలా ముందు చూపుతో పెట్టినవేనని అంటారు.

అంతెందుకు ఎవరైనా ఇంటికి వస్తే, ఏదైనా చెడు జరిగితే ఏ పాదం రా బాబు అనుకోవడం వింటుంటాం. మరి పెళ్లి అయ్యాక కొత్త కోడలు ఇంటికి వచ్చినపుడు కుడిపాదం పెట్టి రా అమ్మా అని అంటారు. ఏ పాదమైతే ఏమిటే అనిపిస్తుంది. కానీ కుడిపాదం పెట్టడం వలన సకల శుభాలు, సంతోషం జరుగుతాయని నమ్మకం.

దీనికి ఉదాహరణ గా పురాణ కాలం నాటి అంశాన్ని కూడా పండితులు ప్రస్తావిస్తారు. సీతమ్మను రావణాసురుడు లంకకు తీసుకుని వెళ్ళినపుడు ఆమె జాడ కోసం వెతికే సమయంలో ఎడమ పాదం పెట్టి వెళ్ళాడట. అందుకే రావణ సంహారం జరిగిందని, ఎడమ పాదం అశుభ సూచకమని అంటారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ