Pearl wearing rules: ముత్యం ఎవరు ధరించాలి…ఎలాంటి ఫలితాలు కలుగుతాయో..?
Pearl wearing rules: రత్న జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పండితుల సలహా తీసుకున్న తర్వాత వజ్రం, ముత్యం, నీలమణి, పచ్చలతో సహా అనేక రత్నాలను ధరించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, నిర్దిష్ట తేదీలలో జన్మించిన వారికి ముత్యం అదృష్ట రత్నంగా నిరూపించబడుతుంది.
పైకి అందరూ జ్యోతిష్యం,జాతకం అంటూ విమర్శలు చేసినప్పటికీ తీరా దీని గురించి తెలుసుకుని ఆసక్తి కనబరిచేవాళ్ళు చాలామంది ఉన్నారు. సెంటిమెంట్స్ కూడా ఎక్కువే మనవాళ్లకు. అందుకే ఏ రాయి ధరిస్తే మంచిదని జాతకం చూపించుకుని మరీ ఉంగరంలో గానీ, గొలుసులో గానీ సదరు రంగు రాయిని ధరిస్తారు.
ఇక ముత్యం గురించి చెప్పక్కర్లేదు. ముత్యాల హారం, ముత్యాల తలంబ్రాలు ఇలా ఎన్నో రకాలుగా ముత్యాన్ని వాడతారు. మంచి ముత్యాల కోసం వేట కూడా చేస్తారు. అయితే శ్వేత వర్ణంలో మెరిసే ముత్యం ధరిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని చాలామంది భావన.
దీనికి తోడు ముత్యం ధరిస్తే వ్యతిరేక ప్రభావాలు కూడా అస్సలు ఉండవు.ముఖ్యంగా మీన,సింహ,ధనుస్సు రాశుల వాళ్ళు ముత్యం ధరిస్తే మంచిదని పండితులు చెబుతుంటారు. చాలామంది బంగారు ఉంగరంలో ముత్యం ధరిస్తారు.
కానీ వెండితో చేసిన ఉంగరంలో ముత్యం పొదిగి ధరిస్తే శ్రేయస్కరమని అంటున్నారు. కోపతాపాలు తగ్గి, మనసు ప్రశాంతంగా, పాజిటివ్ థింకింగ్ తో ఉంటుందని చెబుతారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ