Beauty Tips

Face Glow Tips:చలికాలంలో కొబ్బరినూనె ముఖానికి రాస్తున్నారా…ఈ నిజాలు తెలుసుకోండి

Coconut Oil skin benefits In Winter : చలికాలంలో కొబ్బరినూనెను ముఖానికి మాయిశ్చరైజర్‌లాగా వాడతాం. అయితే దానివల్ల నిజంగానే ఏమైనా ప్రయోజనాలున్నాయో లేదో తెల్సుకోండి. మెరిసే ముఖాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి. ముఖ్యంగా శీతాకాలంలో చర్మాన్ని తేమగా ఉంచుకోవడం కోసం రకరకాల క్రీముల కోసం ఎంతో డబ్బునూ వెచ్చిస్తారు. కొంతమంది మాత్రం సింపుల్ గా కొబ్బరినూనె రాసేసుకుంటారు. దీనివల్ల చర్మానికి మేలా కీడా అనేది వివరంగా తెల్సుకుందాం.

కొబ్బరినూనె అంటే మనలో చాలా మంది తలకు రాసుకోవటం వరకే తెలుసు . అయితే కొబ్బరినూనెలో ఎన్నో చర్మ ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. రాత్రి పడుకునే ముందు ముఖానికి కొంచెం కొబ్బరి నూనె రాసి రెండు నిమిషాలు మసాజ్ చేస్తే ముఖంలో తేమ పెరిగి కాంతివంతంగా మారుతుంది .

అంతేకాకుండా ముడతలు కూడా తొలగిపోతాయి. మొటిమలను తగ్గించటంలో కొబ్బరినూనె చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. కొబ్బరినూనెలో కొంచెం కలబంద,చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయటం వలన ముఖంపై మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను తగ్గించ‌డంతో పాటు మొటిమల వ‌ల్ల వ‌చ్చే మచ్చలను కూడా తగ్గిస్తుంది.

కొబ్బ‌రి నూనెలో కొద్దిగా పంచదార వేసి ముఖానికి కాసేపు స్క్రబ్ చేయాలి.అనంత‌రం చ‌ల్ల‌టి నీటిలో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి ఒకసారి చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉన్న మృత‌క‌ణాలు తొలగిపోయి చ‌ర్మం ప్ర‌కాశ‌వంతంగా మారుతుంది. అలాగే నల్లని మచ్చలు కూడా తొలగిపోయి ముఖం తెల్లగా మెరుస్తుంది.

కొబ్బరి నూనె చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది. చర్మంపై ఉన్న మురికి,దుమ్ము,ధూళిని తొలగించటానికి సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన చర్మంను యవ్వన్నంగా ఉంచుతుంది. చర్మం మీద దద్దుర్లు మరియు చికాకును తగ్గిస్తుంది. చర్మంలో రక్త ప్రసరణను పెంచి చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

కొబ్బరి నూనె దాదాపుగా అన్ని రకాల చర్మ సమస్యలను తగ్గిస్తుంది. చాలా తక్కువ ఖర్చులో చర్మానికి సంబందించిన సమస్యలను తగ్గించుకోవటానికి కొబ్బరి నూనె చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. కాబట్టి కొబ్బరి నూనెను ఉపయోగించి చర్మ సమస్యలను తగ్గించుకోండి. ఈ చిట్కాలను ఫాలో అవ్వండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ