Kitchenvantalu

Brinjal Tomato Pappu Recipe:వంకాయ టమాటో పప్పు రుచిగా రావాలంటే ఇలాచేయండి

Brinjal Tomato Pappu Recipe:వంకాయ టమాటో పప్పు రుచిగా రావాలంటే ఇలాచేయండి .. ఈ పప్పుకి కావలసిన పదార్ధాలు మరియు ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:
వంకాయలు – పావు కేజీ, కందిపప్పు – అరకప్పు, టమోటాలు – 2, పచ్చిమిర్చి – 2, ఉప్పు – రుచికి తగినంత, చింతపండు – నిమ్మకాయంత, పసుపు – అర టీ స్పూను, కొత్తిమీర తరుగు – అరకప్పు; నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, మినపప్పు – తిరగమోతకి సరిపడా.

తయారుచేసే విధానం:
కందిపప్పును శుభ్రంగా కడిగి నీటిని పోసి కొంచెం పసుపు వేసి ఉడికించాలి. పప్పు ఉడికాక జారుగా ఉండేలా నీటిని పోసి మెత్తగా చిదమాలి. నూనెలో తాలింపు వేగాక సన్నగా చీరిన పచ్చిమిర్చి ముక్కలు , వంకాయ ముక్కలు వేసి మూతపెట్టి మూడు నిమిషాలు మగ్గించి ఆ తర్వాత టమోటా ముక్కలను కలపాలి.

ముక్కలు కొంచెం మెత్తబడ్డాక ఉప్పు, పప్పు వేసి 5 నిమిషాలు చిన్నమంటపై మరిగించి కొత్తిమీర చల్లి దించేయాలి.ఈ పప్పు అన్నంతో పాటు పరాటాల్లోకి కూడా చాలా బాగుంటుంది.

గమనిక : చాలా మంది ముదిరిన వంకాయలను పాడేస్తూ ఉంటారు. ఆలా పాడేయకుండా పప్పు చేసుకుంటే బాగుంటుంది.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ