Astrolgy 2025: కొత్త సంవత్సరంలో 12 రాశుల వారి జాతకం ఎలా ఉంటుందో…
Rasi phalalu 2025 in telugu : ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం ప్రస్తుతం డిసెంబర్ నెల నడుస్తోంది. 2024 సంవత్సరం చివరి దశలో ఉంది. దీని తర్వాత కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది గ్రహాల కోణం నుండి 2025 సంవత్సరం చాలా ముఖ్యమైనది. అనేక ప్రధాన గ్రహాలు తమ రాశులను మార్చనున్నాయి. ఫలితంగా 12 రాశుల వారిలో మర్పులు ఉండబోతున్నాయి.
మనలో చాలా మంది జాతకాలను నమ్ముతూ… వారి రాశి ఫలాలను చూసుకుంటూ దానికి అనుగుణంగా ఆలోచనలను చేస్తూ ఉంటారు. అయితే కొంత మంది జాతకాలను అసలు నమ్మరు. కొత్త సంవత్సరం వచ్చిందంటే మనలో ఏమైనా మార్పులు వస్తాయా అని అందరికీ ఆసక్తిగా ఉంటుంది. ఆశావాద దృక్పధంతో ఉండడం వలన మన జాతకం బాగుంటుందేమో అని ఎదురు చూస్తారు. ఇక 2025లో రాశుల వారీగా ఫలితాలు చూస్తే ,
మేష రాశి వారికి వృత్తి, జీవితంలో భారీ మార్పులు ఉంటాయి. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నిరాశ తప్పదు. వృషభ రాశివారు గట్టి సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఆర్ధిక సమస్యలు కొలిక్కి వస్తాయి. ఇంట్లో వాళ్లకు బాగుటుంది. విద్యార్థులైతే విజయాలు సాధిస్తారు. మిధున రాశి వారిలో నిరుద్యోగులకు ఆగస్టు చివరికి ఉద్యోగం లభించే ఛాన్స్ ఉంది. అయితే ఖర్చులు, ఆందోళన పెరుగుతాయి. పెళ్లి సంబంధ విషయాల్లో జాగ్రత్త వహించాలి.
కర్కాటక రాశివాళ్లు సంవత్సర ప్రారంభంలో డబ్బు ఇబ్బంది పడతారు. పని గురించి ఆందోళన ఉంటుంది. అదే సమయంలో తగిన మద్దతు రాదు. వ్యాపార లావాదేవీలు తగ్గుతాయి. ఏప్రియల్ నుంచి ఆగస్టు వరకూ మాత్రం మార్పు లభించి తగిన ఫలితం లభిస్తుంది. సింహరాశి వాళ్ళకు మొదట్లో అన్నింటా మంచి జరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. విద్యాభివృద్ధి కలుగుతుంది. సంవత్సర చివరలో ఆరోగ్య సమస్యలతో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
కన్యా రాశివారికి తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం ఉంటుంది. అన్నింటా విజయాలే. ఒకవేళ ఆటంకాలు వచ్చినా ధైర్యం కోల్పోకుండా ఉంటే విజయం తధ్యం. తులా రాశి వారికి పదోన్నతి, ఆదాయం పెరగడం వంటివి ఉంటాయి. పెళ్లికానివాళ్లకు నవంబర్ తర్వాత లైన్ క్లియర్ అవుతుంది. వ్యాపారులైతే కష్టంతో విజయాలు సాధించాల్సి ఉంటుంది.
వృశ్చిక రాశి వారికి జీవిత భాగస్వామితో ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. ఆర్ధిక స్థితి దెబ్బతింటుంది. అయితే సోమరితనం వదిలేసి పనిచేస్తే కొంత మెరుగు పడుతుంది. ధను రాశి చూస్తే, వైవాహిక జీవనంలో నెగెటివ్ షేడ్స్ ఉంటాయి. అయితే సంవత్సర చివరి భాగంలో ఈ రాశి వాళ్ళు పనిచేసే రంగంలో విజయం సాధిస్తారు. అన్నింటా విజయం వరిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో నెగ్గుకొస్తారు.
మకర రాశి వాళ్ళకు ఎదురయ్యే ఇబ్బందులు శనిదేవుని అనుగ్రహంతో తొలగిపోతాయి. డబ్బు విషయంలో జాగ్రత్త వహించాలి. లైఫ్ పార్టనర్ తో టూరిజం స్పాట్స్ కి వెళ్లే ఛాన్స్ ఉంది. కుంభ రాశివాళ్ళు మే వరకూ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. సులువుగా సంపాదన పెరిగి, ఉద్యోగంలో పదోన్నట్లు వస్తాయి. మొత్తం మీద మంచి ఫలితాలు పొందుతారు.
మీన రాశి వాళ్ళు విదేశీ టూర్స్ కి వెళ్లే ఛాన్స్ ఉంది. ఖర్చులు పెరుగుతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఉద్యోగులకు మంచిదే.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ