Beauty Tips

Banana Peel for face:అర‌టి తొక్కే అని తేలిగ్గా పారేయ‌కండి.. ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా మెరుస్తుంది

Besan And Banana peel Face Glow tips:మ‌న‌లో చాలా మంది అర‌టి పండు తిన్న త‌ర్వాత తొక్క ప‌డేస్తాం క‌దా. కానీ ఇక‌ముందు తొక్కే క‌దా అని తేలిగ్గా తీసిపారేయ‌కండి. ఎందుకంటే దాని వ‌ల్ల చాలా ప్ర‌యోజ‌నాలున్నాయి. ముఖ్యంగా చ‌ర్మ సంర‌క్ష‌ణ‌లో అది చాలా బాగా ఉప‌యోగప‌డుతుంది. వాటి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.

ముఖం అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖం మీద నల్లని మచ్చలు, మొటిమలు వంటి సమస్యలు తగ్గటానికి ఇప్పుడు చెప్పే ప్యాక్ చాలా బాగా సహాయపడుతుంది. దీని కోసం పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఇంటి చిట్కాలతో చాలా తక్కువ ఖర్చులో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.

అలా కాకుండా కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితం వస్తుంది. దీని కోసం ఒక బౌల్ లో అరస్పూన్ శనగపిండి, అరస్పూన్ బియ్యం పిండి, అరటితొక్క మెత్తని పేస్ట్ ఒక స్పూన్, అరస్పూన్ ఆలోవెరా జెల్ వేసి సరిపడా నీటిని పోసి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే ముఖం మీద నల్లని మచ్చలు, తాన్ అన్నీ తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది. ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. అరటిపండు తొక్కలో ఉన్న లక్షణాలు ముఖం మీద మచ్చలను తొలగించటానికి, బియ్యంపిండి,శనగపిండిలో ఉన్న లక్షణాలు మృత కణాలను తొలగిస్తుంది. ఆలోవెరా చర్మం తేమగా ఉండేలా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ