Health

coriander Juice:ఈ ఆకు రసాన్ని త్రాగుతున్నారా…ఊహించని ప్రయోజనాలు ఎన్నో…

coriander Juice Benefits : కొత్తిమీర లేనిది ఆహార పదార్థాలు ఊహించుకోవడం చాలా కష్టం. ఇది ఫుడ్స్‌ టేస్ట్‌ను పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఈ కొత్తమీర ఆకులే కాదు వీటి గింజలు కూడా బోలెడు లాభాలను అందిస్తాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలక వ్యాధులను సైతం తగ్గిస్తాయి.

ధనియాల మొక్కలే ఈ కొత్తిమీర. మంచి సువావన కలిగి ఉండే కొత్తిమీరను వంటల్లో ఎక్కువగా వాడతారు. దాదాపుగా ప్రతి కూరలోను కొత్తిమీరను వేస్తారు. కొత్తిమీరలో థియామైన్ తో సహా అనేక ఖనిజాలు మరియు విటమిన్లు సమృద్దిగా ఉన్నాయి. వాటిలో విటమిన్ సి,భాస్వరం, కాల్షియం, ఇనుము, నియాసిన్, సోడియం, కెరోటిన్, పొటాషియం, కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్, ఫ్యాట్, ఫైబర్ మరియు నీరు ఉంటాయి.

కొత్తిమీర అనేది వంటలకు రుచిని,వాసనను ఇవ్వటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కొత్తిమీరను వంటలలో వేసుకోవచ్చు. పచ్చడిగా చేసుకొని తినవచ్చు.అలాగే జ్యుస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. కొత్తిమీరను ఏ రూపంలో తీసుకున్న అన్ని రకాల ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి. కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన హానికరమైన కొవ్వులను శరీరం నుండి తొలగించి ఆరోగ్యకరమైన కొవ్వులు పెరిగేలా ప్రోత్సాహం ఇస్తుంది.
Face Beauty Tips In telugu
చర్మ సౌందర్య ఉత్పత్తులలో కొత్తిమీర రసాన్ని ఉపయోగిస్తారు. కొత్తిమీర రసం ముఖం పైన ఉండే మొటిమలకు, పొడి చర్మం, నల్లటి మచ్చలను తగ్గిస్తుంది. తలనొప్పి,అలసట,టెన్షన్ వంటివి ఉన్నప్పుడు కొత్తిమీర రసాన్ని త్రాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే కొత్తిమీరతో ఉండే ‘ఎసేన్షియాల్ ఆయిల్స్’ అలసట,తలనొప్పి వంటి వాటిని తగ్గించటంలో సహాయపడతాయి.
Joint pains in telugu
ఎముకలు బలంగా ఉండటానికి కావలసిన విటమిన్ ‘K’ కొత్తిమీరలో పుష్కలంగా ఉన్నాయి. కొత్తిమీర వంటలకు మంచి రుచిని ఇవ్వటమే కాకుండా జీర్ణక్రియ రేటుని బాగా పెంచుతుంది. దాంతో  జీర్ణక్రియ వ్యాధులు , అజీర్ణం, వాంతులు, వంటివి తగ్గుతాయి. కంటికి సంబందించిన వ్యాధులు రాకుండా చేస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు రెగ్యులర్ డైట్ లో కొత్తిమీరను భాగంగా చేసుకుంటే కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే మధుమేహం ఉన్నవారు ప్రతి రోజు అరగ్లాసు కొత్తిమీర రసాన్ని త్రాగితే రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

కొత్తిమీరతో ఎలేమోల్, కామ్ఫార్, బొర్నెఒల్, కార్వోన్, క్వుర్సేటిన్, కేంఫెరాల్, మరియు ఎపిగేనిన్’లను ఎక్కువగా కలిగి ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేస్తుంది. అలాగే కిడ్నీ స్టోన్స్ ని తగ్గించటంలో కూడా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. కొత్తిమీరలో ఐరన్ సమృద్ధిగా ఉండుట వలన రక్త హీనత సమస్య ఉన్నవారు కొత్తిమీరను రెగ్యులర్ గా తీసుకుంటే ఆ సమస్య నుండి బయట పడవచ్చు. 

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ