Healthhealth tips in telugu

Onion Peel Tea:ఈ టీ తాగితే అధిక బరువు,డయాబెటిస్,చెడు కొలెస్ట్రాల్,రక్తపోటు అనేవి అసలు ఉండవు

Onion Peel Tea benefits In telugu :ఈ టీ తాగితే అధిక బరువు,డయాబెటిస్,చెడు కొలెస్ట్రాల్,రక్తపోటు అనేవి అసలు ఉండవు.. మనం సాదరణంగా ఉల్లిపాయలను వాడినప్పుడు తొక్కలను పాడేస్తూ ఉంటాం. ఈ తొక్కలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉల్లిపాయ తొక్కలను శుభ్రంగా కడగాలి. రెండు ఉల్లిపాయల తొక్కలను తీసుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి రెండు గ్లాసుల నీటిని పొడి ఉల్లిపాయ తొక్కలను వేసి 10 నిమిషాలు మరిగించాలి.
Onion beaUTY tIPS
ఈ టీని వడకట్టాలి. అరగ్లాస్ ఉల్లిపాయ తొక్కల టీ ని తాగాలి. అవసరం అయితే రుచి కోసం తేనె కలుపుకొని తాగవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకోవాలి. ఈ టీని ప్రతి రోజు తాగుతూ ఉంటే ఎన్నో ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. వాటి గురించి తెలుసుకుందాం. బరువు తగ్గటానికి మరియు శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది.

యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉండుట వలన దగ్గు, జలుబు,బ్రోన్కైటిస్ వంటి సీజనల్ వ్యాధులను తగ్గించటానికి సహాయపడుతుంది. విటమిన్ సి ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. డయాబెటిస్ ఉన్న వారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.

చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి రక్త నాళాలను శుభ్రపరచి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. రక్తం గడ్డకట్టకుండా మరియు రక్త నాళాలు మూసుకుపోకుండా నిరోధిస్తుంది. దాంతో గుండెకు ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది. ఉల్లిపాయ తొక్కలో క్వెర్సెటిన్ అని పిలువబడే ఒక ప్రత్యేకమైన ఫ్లేవనాయిడ్ ఉంటుంది.

ఇది రక్తపోటును తగ్గించడంలో, వాపు మరియు అలెర్జీలను తగ్గించడంలో, అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గించడంలో మరియు ఇతర క్యాన్సర్‌లను నివారించడంలో కీలకమని ఇటీవల జరిగిన పరిశోదనల్లో తేలింది. అంతేకాకుండా ఈ ఫ్లేవనాయిడ్ వృదాప్య లక్షణాలను ఆలస్యం చేస్తుంది. అలాగే చర్మం ముడతలు లేకుండా మృదువుగా ఉండేలా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ