Kitchenvantalu

Sweet corn Payasam: స్వీట్ కార్న్ పాయసం ఇలా చేస్తే అదిరిపోతుంది, చేయడం చాలా సులువు

Sweet corn Payasam: స్వీట్ కార్న్ పాయసం ఇలా చేస్తే అదిరిపోతుంది, చేయడం చాలా సులువు.. సాధారణంగా మొక్క జొన్న పొత్తులు నిప్పుల పై కాల్చుకోని తింటుంటారు. లేదంటే ఉడికించి స్వీట్ కార్న్ ఎంజాయ్ చేస్తారు. కాని మొక్క జొన్న గింజలతో పాయసం చేసి చూడండి టేస్ట్ అదిరిపోతుంది.

కావాల్సిన పదార్ధాలు
మొక్కజొన్న గింజలు – 1 కప్పు
పాలు – 1 లీటర్
బెల్లం తురుము – ¾ కప్పు
నెయ్యి – 2-3 టేబుల్ స్పూన్స్
యాలకులు – ½ టీ స్పూన్

తయారీ విధానం
1.మిక్సి జార్ లోకి మొక్కజొన్న గింజలను వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.రెండు టేబుల్ స్పూన్స్ గింజలను పక్కన పెట్టుకోండి.
2.ఇప్పుడు ప్యాన్ లో ½ లీటర్ పాలు వేడి చేసి బాగా మరగనివ్వాలి.
3.వేరోక బాండీలో రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేడి చేసి అందులోకి పక్కన పెట్టుకున్న మొక్క జొన్న గింజలను వేపుకోని పక్కన పెట్టుకోవాలి.
4.వేడి చేసుకున్న పాలలో మొక్కజొన్న పేస్ట్ వేసుకోని ఉండలు లేకుండా కలుపుతూ రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి.

5.ఇప్పుడు అందులోకి బెల్లం వేసి కలుపుతు కరిగించుకోవాలి.
6.బెల్లం కరిగాక వేయించుకున్న కార్న్ గింజలను వేసి మరి కాసేపు ఉడికించుకోవాలి.
7.కాస్త చిక్కపడుతున్న ఈ ఖీర్ లోకి యాలకుల పొడి,మరికాస్త నెయ్యి యాడ్ చేసుకోని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
8. అంతే కార్న్ పాయసం రెడీ..వేడి వేడి గా సర్వ్ చేసుకోవడమే.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ