Beauty Tips

Face Glow Tips: ఎటువంటి మేకప్‌ లేకుండా ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా మెరుస్తుంది

Lemon and Coffee Face PAck:ఎటువంటి మేకప్‌ లేకుండా ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా మెరుస్తుంది. ముఖం తెల్లగా అందంగా మెరవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలా కోరుకోవటం కూడా సహజమే. దాని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్భును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు.

అలా కాకుండా మన వంటింటిలో ఉండే కొన్ని సహజసిద్దమైన పదార్ధాలతో చాలా సులభంగా ఎంతటి నల్లని ముఖాన్ని అయినా తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు. కాస్త శ్రద్ద,సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

ఒక బౌల్ లో ఒక స్పూన్ కాఫీ పొడి, ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి ముఖానికి రాసి 5 నిమిషాలు అయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే ముఖం మీద మచ్చలు ఏమి లేకుండా మెరుస్తుంది.

నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ మరియు విటమిన్ సి ఉండుట వలన దెబ్బతిన్న చర్మ కణాలను శుభ్రం చేయటమే కాకుండా బ్లీచ్ చేస్తాయి. నిమ్మకాయలోని చర్మాన్ని ప్రకాశవంతం చేసే గుణాలు సమృద్దిగా ఉన్నాయి.

కాఫీ పొడిలో ఉన్న లక్షణాలు చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అలాగే నలుపును తొలగించి ముఖం తెల్లగా మెరిసేలా చేస్తుంది. కాఫీ,నిమ్మరసం రెండు కూడా చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ