Beauty Tips

Hair Care Tips : జుట్టు వేగంగా పెరగాలంటే వారానికి రెండుసార్లు ఈ పని చేయండి..

Curry leaves And kalonji seeds Home remedies:జుట్టు వేగంగా పెరగాలంటే వారానికి రెండుసార్లు ఈ పని చేయండి..జుట్టుకి సంబందించిన సమస్యలను తగ్గించుకోవటానికి ఖరీదైన నూనెలను వాడవలసిన అవసరం లేదు. మన ఇంటిలో ఉన్న వస్తువులను ఉపయోగించి నూనెను తయారుచేసుకొని వాడితే సరిపోతుంది.

జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి, జుట్టు కుదుళ్లు బలంగా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జుట్టుకు రక్త ప్రసరణ మెరుగుపరచడానికి ఒక మంచి నూనెను తయారు చేసుకుందాం. ఈ నూనె రాయటం వల్ల జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ బాగా సాగి జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

ఒక గిన్నెలో ఐదు ఉసిరికాయలను తురుముకుని వేసుకోవాలి. ఆ తర్వాత గుప్పెడు గోరింటాకు., గుప్పెడు కట్ చేసిన మందార ఆకులు, 100 గ్రాముల మెంతులు, రెండు స్పూన్ల kalonji seeds, గుప్పెడు గుంటగలగరాకు, గుప్పెడు కరివేపాకు వేసి దానిలో అరకేజీ కొబ్బరి నూనె వేయాలి.

ఇప్పుడు పొయ్యిమీద పెట్టి తక్కువ మంటలో పదార్థాలన్నీ కలుపుతూ నల్లగా మారే అంతవరకు నూనెను మరిగించుకోవాలి. ఈ నూనెను వడగట్టి నిల్వచేసుకోవాలి. ఈ నూనెను ప్రతి రోజూ తలకు రాసుకుంటూ రెండు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇలా చేస్తూ ఉంటే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది.

అలాగే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. తల మీద చర్మం ఇన్ఫెక్షన్ కు గురికాకుండా ఉంటుంది. చుండ్రు సమస్య కూడా ఉండదు. జుట్టు ఆరోగ్యంగా పొడవుగా పెరుగుతుంది. ఈ నూనె దాదాపుగా రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ నూనె చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ