Kitchenvantalu

Instant Oats Idli:ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో అప్పటికప్పుడు చేసుకునే మెత్తని ఇడ్లీలు..

Oats Idli: ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో అప్పటికప్పుడు చేసుకునే మెత్తని ఇడ్లీలు..అప్పటికప్పుడు చేసుకునేలా ఇడ్లీలు ఓట్స్ తో తయారు చేసుకోవచ్చు.డైట్ లో ఉన్నవారు ఇడ్లీలను ఓట్స్ తో తయారు చేసుకుంటే బ్రేక్ ఫాస్ట్ హ్యాపీగా తినెయ్యొచ్చు.

కావాల్సిన పదార్ధాలు
ఓట్స్ – 1 కప్పు
బొంబాయి రవ్వ – ½ కప్పు
ఉప్పు – ¾ టీ స్పూన్
బేకింగ్ సోడా – ½ టీ స్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
అల్లం పేస్ట్ – 1 టీ స్పూన్
పచ్చిమిర్చి – 2
క్యాప్సికం తరుగు – 2 టేబుల్ స్పూన్స్
క్యారెట్ తరుగు – 2 టేబుల్ స్పూన్స్

తయారీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని ఓట్స్ ని దోరగా వేపుకోవాలి.
2.తర్వాత బొంబాయి రవ్వను కూడ దోరగా వేపుకోవాలి.
3.వేయించిన ఓట్స్ ను మిక్సి జార్ లో వేసి రవ్వ రవ్వగా గ్రైండ్ చేసుకోవాలి.
4.ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో గ్రైండ్ చేసుకున్న రవ్వ,బొంబాయి రవ్వ,ఉప్పు ,బేకింగ్ సోడా ,జీలకర్ర వేసి కలుపుకోవాలి.
5.అందులోకి అల్లం తరుగు పచ్చిమిర్చి తరుగు,కూరగాయ తరుగును జోడించి కలుపుకోవాలి.

6.అందులోకి 1 కప్పు పెరుగు,సరిపడా నీళ్లు యాడ్ చేసుకోని ఇడ్లీ బ్యాటర్ ల ప్రిపేర్ చేసుకోవాలి.
7.కలుపుకున్న పిండిని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
8.ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ లోకి మిశ్రమాన్ని వేసి ఇడ్లీ కుక్కరో అడుగున నీళ్లు పోసి ఇడ్టీని సెట్ చేసుకోని హై ఫ్లేమ్ పై ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఏడు నిమిషాలు ఉడికించుకోవాలి.
9.స్టవ్ ఆఫ్ చేసుకోని ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవడమే.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ