Maggi Manchurian:పిల్లలకు నచ్చేలా మ్యాగీ మంచూరియన్ రెసిపీ.. ఇలా చేసేయండి..
Maggi Manchurian: పిల్లలకు నచ్చేలా మ్యాగీ మంచూరియన్ రెసిపీ.. ఇలా చేసేయండి.. ఈ రోజుల్లో ఎంత వద్దు అనుకున్న అప్పుడప్పుడు ఫాస్ట్ ఫుడ్ తినాలి అనిపించడం కామన్. చాలా మంది ఇష్టంగా తినే మంచురియన్ ని,మ్యాగితో ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చేసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
మ్యాగి స్లైసెస్ – 3
ఉల్లిపాయలు – తగినన్ని
కొత్తిమీర – ¼ టీస్పూన్
పచ్చిమిర్చి – 2
షెజ్వాన్ సాస్ – 1 టీ స్పూన్
చిల్లి సాస్ – 1 టీ స్పూన్
కార్న్ ఫ్లోర్ – ½ కప్పు
మైదా – 2 టేబుల్ స్పూన్
బియ్యం పిండి – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – తగినంత
నూనె – సరిపడా
సాస్ కోసం..
ఉల్లిపాయలు – 1 కప్పు
క్యాప్సికం – 1
అల్లం – 1 స్పూన్
వెల్లుల్లి – 1 ½ స్పూన్
పచ్చిమిర్చి – 2
టమాటో సాస్ – 2 టీ స్పూన్
షెజ్వాన్ సాస్ – ½ టీ స్పూన్
చిల్లీ సాస్ – 1 స్పూన్
సోయా సాస్ – 1 ½ స్పూన్
వెనిగర్ – 2 స్పూన్
కార్న్ ఫ్లోర్ – 1 టేబుల్ స్పూన్
పెప్పర్ పౌడర్ – ½ టీ స్పూన్
ఉప్పు – ½ టీ స్పూన్
కొత్తిమీర – ¼ కప్పు
నూనె – తగినంత
తయారీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నీళ్లను వేడి చేసి మ్యాగి స్లైస్ లను వేసుకోవాలి.
2.మ్యాగి ఉడికాక బయిటికి తీసి చల్లారనివ్వండి.
3.వేరోక బౌల్ లోకి క్యాప్సికం,క్యారెట్లు ,ఉల్లిపాయలు,క్యాబేజీ,కొత్తిమీర,తరిగిన పచ్చిమిర్చి,షెజ్వాన్ సాస్,చిల్లిసాస్,ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
4.ఇప్పుడు అందులోకి మైదా,కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకోవాలి,.
5.ఉడికించిన మ్యాగిని విరగకుండ మిశ్రమంలోకి కలుపుకోవాలి.
6.పిండిని చిన్న బాల్స్ లా చేసుకోని చిన్న ముక్కలుగా విడిగొట్టిన మ్యాగిపై పిండితో చేసిన బాల్స్ రోల్ చేసి వేడి నూనెలో వేసి బ్రౌన్ కలర్ లోకి మారేలా వేపుకోవాలి.
7.ఇప్పుడు గ్రేవీ కోసం ప్యాన్ వేడి చేసి అందులోకి నూనె వేడిచేసి అందులోకి అల్లం,వెల్లుల్లి తురుము,అవివేగాక ఉల్లిపాయలు,పచ్చిమర్చి వేసి వేగనివ్వాలి.
8.ఉల్లిపాయలు వేగాక అందులోకి క్యాప్సికం ,టమాటో సాస్,చిల్లిసాస్,షెజ్వాన్ సాస్,సోయాసాస్ ,వెనిగర్ వేసి బాగా కలుపుకోవాలి.
9.వేరొక బౌల్ 1 టేబేల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి ½ కప్పు నీళ్లు కలుపుకోవాలి.
10 .కలుపుకున్న కార్న్ ఫ్లోర్ నీళ్లను గ్రేవిలో యాడ్ చేసుకోవాలి.
11.గ్రేవి లోకి మరో ½ కప్పు నీళ్లను యాడ్ చేసి దగ్గర పడేవరకు కులుపుతు ఉడకనివ్వాలి.
12.గ్రేవి చిక్క పడ్డాక కొత్తి మీర చల్లుకోని అందులోకి ఫ్రై చేసుకున్న మంచురీయన్ బాల్స్ వేసి నిమిషం పాటు టాస్ చేసుకోవాలి.చివరగా ఉల్లిపాయలు ,స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకోని సర్వ్ చేసుకోవడమే.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ