Banana Flower Benefits : వారానికోసారి అరటి పువ్వు తినండి.. శరీరంలో మ్యాజిక్ చూడండి
Banana Flower Benefits : వారానికోసారి అరటి పువ్వు తినండి.. శరీరంలో మ్యాజిక్ చూడండి.. అరటి చెట్టులోని అన్ని భాగాలు మనకు మేలు చేస్తాయి. మన వంటల్లో అరటి పువ్వు కలపడం చాలా అరుదుగా కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో తప్పనిసరిగా అరటి చెట్టు కనిపిస్తూ ఉంటుంది.
అయితే అరటి పువ్వు అనేది చాలా తక్కువగా ఉపయోగిస్తుంటారు. మనం దానిని ఎక్కువగా ఉపయోగించం. అరటి పువ్వు ప్రయోజనాల గురించి తెలుసుకున్న తర్వాత, మీరు ఖచ్చితంగా అరటి పువ్వును వంటలో ఉపయోగిస్తారు.
అరటిపండ్లను అందించే అరటి చెట్టులో ప్రతి భాగం ఉపయోగపడేదే. అరటిపండ్లు, అరటి దూట, అరిటి పువ్వు ఇలా అన్ని రకాలలోను ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దక్షిణ ఆసియాలో అరటి పువ్వును ఆరోగ్యకరమైన కూరగాయగా తింటారు. కూర,సలాడ్స్,సూప్స్ రూపంలో ఎక్కువగా తీసుకుంటారు. అరటి పువ్వులో అర్టిచోక్స్ ఉండుట వలన అరటి పువ్వు మంచి ఫ్లేవర్ ని కలిగి ఉంటుంది.
అరటి పండు కంటే అరటిపువ్వుతో మరిన్ని లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.అరటి పువ్వును డైరెక్ట్ గా కాకుండా కూర వండుకొని తినాలి. తరచుగా అరటి పువ్వును తినటం వలన ఎన్నో అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు. 100గ్రాముల అరటి పువ్వులో 51 క్యాలరీలు, 1.6 ప్రోటీన్స్, 0.6 ఫ్యాట్, 9.9 కార్బోహైడ్రేట్స్, 5.7ఫైబర్, 56mg ల క్యాల్షియం, 73mg ఫాస్పరస్, 56.4 mg ఐరన్, , 13mg కాపర్, 553.3mg పొటాషియం, ఇంకా మెగ్నీషియం, విటమిన్ ఇలు కూడా ఉన్నాయి.
అరటి పువ్వును బనానా హార్ట్ అని కూడా పిలుస్తారు. అరటి పువ్వు హార్ట్ రొంగులో ఉండటం వలన ఆలా పిలుస్తారు. ఇప్పుడు అరటి పువ్వులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. చాలా మందికి అరటిపువ్వుని కూరగా చేసుకుంటారని తెలియదు. అందువల్ల అరటి పువ్వును చాలా మంది తినరు.
ఇప్పుడు చెప్పే ప్రయోజనాలను చూస్తే తప్పకుండా అరటి పువ్వును తినటం అలవాటు చేసుకుంటారు. అరటి పువ్వులో ఎథనోల్ ఉండుట వలన ఇన్ ఫెక్షన్స్ రాకుండా చూస్తుంది. ఇటీవల జరిగిన పరిశోధనల్లో అరటి పువ్వు రసం మలేరియా ప్యారాసైట్ ప్లాస్మోడియంను ఫాల్సిపెరమ్ ను నివారించడంలో గ్రేట్ గా పనిచేస్తుందని తెలిసింది.
అరటి పువ్వు రసంలో ఉండే మెథనోల్ యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు ప్రొసెస్ చేస్తుంది. శరీరంలో హానికరంగా ఉన్న ఫ్రీ రాడికల్స్ ని బయటకు పంపిస్తుంది. దాంతో అనేక వ్యాధులు తగ్గుతాయి. అంతేకాక ప్రీమెచ్యుర్ ఏజింగ్, మరియు క్యాన్సర్ ను నివారిస్తుంది. మహిళలు పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పితో చాలా ఇబ్బంది,బాధ ,అసౌకర్యానికి గురి అవుతారు.
అలాంటి సమయంలో ఒక కప్పు, ఉడికించిన అరిటిపువ్వును, పెరుగుతో కలిపి తీసుకుంటే శరీరంలో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ యాక్టివ్ అయ్యి కడుపు నొప్పిని తగ్గిస్తుంది. అరటి పువ్వులో యాంటీమైక్రోబయల్ లక్షణాలు, హైపోగ్లిసిమిక్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రణలో ఉంచటం మరియు రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది.
అరటి పువ్వులో విటమిన్స్ ఎ, సి, మరియు ఇ, పొటాషియం, ఫైబర్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన న్యూట్రియన్స్ ని అందించే ఆరోగ్యకరమైన ఆహారంగా చెప్పవచ్చు. డిప్రెషన్ మరియు ఆందోళనగా ఉన్నప్పుడు అరటి పువ్వును తింటే ఆందోళన నుండి బయట పడవచ్చు.
అరటి పువ్వులో నేచురల్ యాంటీ డిప్రెసెట్స్ ఉండుట వలన ఏలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా డిప్రెషన్ ని తగ్గిస్తుంది.పాలిచ్చే తల్లులు రెగ్యులర్ డైట్ లో అరటిపువ్వును చేర్చుకుంటే బిడ్డ సరిపడా పాలు పడతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ