Healthhealth tips in telugu

White Teeth:ఏ పేస్టుతో తోమినా పళ్లు పచ్చగానే కనిపిస్తున్నాయా.. ఇలా చేస్తే సరి..

White Teeth:ఏ పేస్టుతో తోమినా పళ్లు పచ్చగానే కనిపిస్తున్నాయా.. ఇలా చేస్తే సరి.. దంతాలు తెల్లగా ఉంటేనే చూడటానికి కూడా అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఎవరి ముఖంలో అయినా ముందుగా కనిపించేది దంతాలే.

కాబట్టి ఆ దంతాలు తెల్లగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. దంతాలు తెల్లగా మెరుస్తూ ఉంటే ఆ లుక్కే వేరు. దంతాలు పసుపు పచ్చగా, మచ్చలుగా ఉంటే చాలా చిరాకుగా కనిపిస్తాయి. ప్రస్తుత కాలంలో చాలా మంది ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.

ముఖంలో మరో అందమైన భాగం అందమైన పలువరుస ఎంతో అందంగా ఉంటుంది. అయితే పలువరుస అందంగా ఉన్నా, పళ్ళు పచ్చగా గార పట్టి ఉంటే నలుగురిలో హాయిగా నవ్వలేము. అందుకే, ఎప్పుడూ పళ్ళను శుభ్రంగా ఉంచుకోవాలి. చాలా మంది వారి దంత సంరక్షణ కోసం రెగ్యులర్ గా డెంటిస్ట్ ను కలుస్తుంటారు.

రోజులో రెండు సార్లు బ్రెష్ చేసుకోవడం చేస్తుంటారు. అందుకే వారి దంతాలు తెల్లగా మిళమిళలాడుతూ ఆరోగ్యం ఉంటాయి. అయితే మరొకొందరికి ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్న వారి దంతాలు అంత అందంగా కనబడవు, పసుపుపచ్చగా కనబడుతుంటాయి.

మరి ఈ సమస్యకు పరిష్కారం ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తోనే కేవ‌లం 3 నిమిషాల్లోనే మీ దంతాల‌ను తెల్ల‌గా మారేలా చేయ‌వచ్చు. పచ్చగా ఉన్న దంతాలను తెల్ల‌గా క‌నిపించేలా చేసేందుకు కేవ‌లం రెండు ప‌దార్థాల‌ను తీసుకుంటే చాలు. అవే బేకింగ్ సోడా, నిమ్మ‌ర‌సం. ఒక చిన్న‌పాటి బౌల్‌లో ఒక స్పూన్ బేకింగ్ సోడాను తీసుకోవాలి. దానికి స‌గం నిమ్మ‌కాయ నుంచి తీసిన రసాన్ని కొద్ది కొద్దిగా క‌ల‌పాలి.

చివ‌ర‌కు బేకింగ్ సోడా నిమ్మ‌ర‌సంలో పార‌ద‌ర్శ‌కంగా క‌రిగి ఓ ద్రావ‌ణంలా త‌యార‌వుతుంది. ఈ ద్రావ‌ణంలో కొద్ది భాగాన్ని చేతి వేలిపై తీసుకుని దాంతో దంతాల‌పై బ్ర‌ష్ చేసిన‌ట్టు చేయాలి. అనంత‌రం నీటితో నోటిని పుక్కిలించాలి. అంతే, క్ష‌ణాల్లోనే దంతాలు తెల్ల‌గా మారుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ