Devotional

Kumba Rasi Facts:కుంభరాశి వారు తమ జీవిత భాగస్వామితో ఏ విధంగా ప్రవర్తిస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు?

Kumba Rasi life partner behavior: నిజానికి అందరూ ఒకేలా ఉండరు. ఒకొక్కరి తీరు ప్రవర్తన ఒక్కోలా ఉంటుంది. అయితే రాశుల ఆధారంగా మనం ఎన్నో ముఖ్యమైన విషయాలను తెలుసుకోవచ్చు. ఒక మనిషి యొక్క స్వభావం వాళ్ళ ప్రవర్తన వంటివి మనం రాశుల ద్వారా తెలుసుకు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవచ్చు.

రాశుల బట్టి మనం మనిషిలో మంచి, చెడు కూడా చూడొచ్చు. ఒక్కొక్క మనిషి యొక్క తీరు, ప్రవర్తన ఒక్కోలా ఉంటుంది. ఏ మనిషి స్వభావం మరొకరిలా ఉండదు. ఏ రాశి వారితో జాగ్రత్తగా ఉండాలి, ఏ రాశి వారితో బాగా ఉండొచ్చు అనే విషయాలను కూడా మనం ఇతరుల యొక్క రాశులను బట్టి కూడా అంచనా వేసుకో వచ్చు.

మనలో చాలా మంది జాతకాల ప్రకారం పనులను చేస్తూ ఉంటారు. జాతకాల మీద నమ్మకం లేని వాళ్ళు అంటూ ఉండరు. అక్కడక్కడా కొందిమంది నమ్మకపోయినా ఒక్కోసారి తేడా వస్తే తమ జాతకం చూపించుకోవడం కూడా చేసేవాళ్ళు వున్నారు. ఇక కుంభరాశి వారు ఎలా ప్రవర్తిస్తారు. జీవిత భాగస్వామితో ఎలా ఉంటారు , ఇతరులతో ఎలా మసలుకుంటారు వంటి విషయాలు ఓసారి పరిశీలిద్దాం.

విప్లవాత్మక మార్పులకు కుంభరాశి వారి మెదడు పుట్టినిల్లుగా చెబుతారు. అందరూ ఒకలా ఆలోచిస్తే, కుంభరాశి వాళ్ళు మరోలా ఆలోచిస్తారు. ముఖ్యంగా కుంభరాశి వారు క్రియేటివిటీకి పెట్టింది పేరు. ప్రతి ఆలోచనలో నూతనత్వం కోరుకుంటారు. కుంభరాశి వారు చెప్పాలనుకున్నది నిర్మొహమాటంగా చెప్పడం వలన జీవితంలో కొంత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది.

వీరివలన ఎవరికీ హాని ఉండదు. హాని చేయరు అయినా సరే, వీరి మాట తీరు సరిగ్గా ఉండదు అనే ముద్ర సమాజంలో పడుతుంది. అందుకే చెప్పాలని అనుకున్న మాటను కాస్త సున్నితంగా చెబితే మంచిది. ఏదైనా సమస్య వస్తే దాని మూలాలు వెదికి పట్టుకునే ప్రయత్నం చేసి, వాటి పరిష్కారానికి ప్రయత్నం చేస్తారు. సమస్య పరిష్కారం దొరక్కపోతే, భగవంతుని మీద భారం వేసి, ఇక ముసుగు తన్ని పడుకుంటారని చెప్పవచ్చు.

దీన్ని జీవిత భాగస్వామి అర్ధం చేసుకోవాలి. ఒక్కోసారి వీరి అసహనాన్ని పరీక్షించే ప్రయత్నం చేశామనుకోండి ఇక వారి కోపాన్ని భరించడం కష్టమని చెప్పవచ్చు. కొంత గిరిగీసుకుని వుంటారు. అందుకే జీవిత భాగస్వామి గాని మరెవరైనా గానీ వీరితో తెగేదాకా లాక్కుండా ఆ సమస్యను వదిలియడం మంచిదని చెప్పవచ్చు. అంతేకాదు కుంభరాశి వారు స్నేహాన్ని ఎక్కువగా కోరుకుంటారు.

పదిమంది బాగుండాలని కోరుకుంటారు. కుంభరాశి వారు తమ జీవిత భాగస్వామి ఎక్కువ స్థాయిలో వున్నా, తక్కువ స్థాయిలో వున్నా దాన్ని అస్సలు పట్టించుకోరు. ఏమాత్రం వీరి మనసులో తేడా ఉండదు. ఇక పట్టు విడుపు ధోరణులు వీరికి జన్మతః అబ్బిన్న గుణాలని అంటారు. అయితే,కుంభరాశి వారు అసహనానికి గురైనప్పుడు మాట విసిరేస్తారు.

దానివలన ఇబ్బంది వస్తుంది. ఆతర్వాత సారీ చెప్పినా సరే,ఎదుటివాళ్ళు తొందరగా మరిచిపోరు. అందుకే నోరు అదుపులో ఉంచుకోవడం, అసహనం కలిగినపుడు ప్రశాంతంగా ఉండడం మంచిదని చెప్పవచ్చును. ఏది ఏమైనా తెగేదాకా లాగడం కూడా మంచిది కాదని కుంభరాశి వారితో మసలే వారు అర్ధం చేసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ