Hair Care Tips:బ్రౌన్ రైస్‌తో ఇలా చేస్తే హెయిర్ ఫాల్ సమస్యే ఉండదు..తెలుసా
Brown Rice Hair Growth Tips: బ్రౌన్ రైస్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయం మనకు తెలిసిందే.. అయితే జుట్టు సమస్యలకు చెక్ పెడటానికి కూడా బ్రౌన్ రైస్ సహాయపడుతుంది.
జుట్టు రాలే సమస్య రాగానే మనలో చాలా మంది కంగారు పడతారు. అది సహజం. అయితే జుట్టు రాలే సమస్య ప్రారంభం అయినప్పుడు అసలు కంగారు పడకుండా ఇంటి చిట్కాలు ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మన ఇంటిలో ఉండే సహజసిద్దమైన పదార్ధాలతో సులభంగా జుట్టు రాలే సమస్య నుండి బయట పడవచ్చు.
జుట్టు సమస్యలను తగ్గించటానికి Brown Rice బాగా సహాయపడుతుంది. ఈ మధ్యకాలంలో Brown Rice వాడకం కూడా చాలా ఎక్కువ అయింది. Brown Rice లో ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా బ్యూటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి రెండు స్పూన్ల Brown Rice, రెండు Black Tea bags వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి.
ఈ నీటిని వడకట్టి ఒక స్ప్రే బాటిల్ లో పోసి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు అంతా కవర్ అయ్యేలా స్ప్రే చేయాలి. ఆ తర్వాత షవర్ క్యాప్ పెట్టుకొని ఒక గంట తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ప్రయోజనం కనపడుతుంది.
ఈ చిట్కా ఫాలో అయితే జుట్టు రాలే సమస్య,తెల్లజుట్టు సమస్య, జుట్టు చివర్లు చిట్లటం, జుట్టు బ్రేక్ అవ్వటం వంటి అన్నీ రకాల సమస్యలు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ