Hair Fall Tips:పుల్లటి మజ్జిగ పారేయకండి..ఇలా చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది
Hair Fall Tips:పుల్లటి మజ్జిగ పారేయకండి..ఇలా చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది.. ఈ మధ్య కాలంలో జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య అనేవి చాలా సాధారణ సమస్యలుగా మారిపోయాయి. ఈ సమస్యలు రాగానే మనలో చాలా మంది కంగారు పడి మార్కెట్ లో దొరికే ఖరీదైన ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే వస్తువులతో సులభంగా తగ్గించుకోవచ్చు.
మనం సాధారణంగా పుల్లని మజ్జిగ ఉంటే ఆ మజ్జిగను తాగలేక బయట పారబోస్తూ ఉంటాం. అయితే పుల్లని మజ్జిగ జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది.జుట్టు రాలే సమస్య,చుండ్రు సమస్య ఉన్న వారికి చాలా బాగా పనిచేస్తుంది. దీనికోసం ముందుగా బాగా పండిన అరటిపండును మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి.
ఒక బౌల్ లో అరటిపండు పేస్ట్, ఒక గుడ్డు తెల్ల సోన, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక కప్పు పుల్లని మజ్జిగ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించి ఒక గంట అయ్యాక కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తే సమస్య తగ్గుతుంది.
మజ్జిగ లో ఉండే ప్రోటీన్ జుట్టుకు అవసరమైన పోషణను అందిస్తుంది. జుట్టు పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది. స్కాల్ప్ శుభ్రంగా ఉండేలా చేసి చుండ్రు సమస్య లేకుండా చేస్తుంది. గుడ్డులో పోషకాలు ఎక్కువగా ఉండుట వలన జుట్టుకు సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. గుడ్డులో విటమిన్లు ఎ మరియు ఇ, బయోటిన్ మరియు ఫోలేట్ ఉండుట వలన జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా పెరగటానికి సహాయపడుతుంది.
అరటిపండులో ఉన్న పోషకాలు దెబ్బతిన్న జుట్టును పునరుద్ధరించడంలో సహాయపడతాయి. ఆలివ్ ఆయిల్ లో ఒలిక్ యాసిడ్ వంటి మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉండుట వలన జుట్టు చివర్లు చిట్లకుండా చేయటమే కాకుండా జుట్టు మృదువుగా ఉండేలా చేస్తుంది. చాలా తక్కువ ఖర్చులో ఇలా చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు రాలే సమస్య నుండి బయట పడవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ