Weight LOss:అర స్పూన్ పొడి శరీరంలో కొవ్వు కరిగి బరువు తగ్గటమే కాకుండా మరెన్నో ప్రయోజనాలు
Weight LOss:అర స్పూన్ పొడి శరీరంలో కొవ్వు కరిగి బరువు తగ్గటమే కాకుండా మరెన్నో ప్రయోజనాలు.. ఈ మధ్యకాలంలో మనలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు సమస్య నుండి బయటపడటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవి పెద్దగా ఫలితాన్ని ఇవ్వక నిరాశకు గురవుతూ ఉంటారు. ప్రతిరోజు అరగంట వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే కచ్చితంగా నెలరోజుల్లో బరువు తగ్గడాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు.
పొయ్యి వెలిగించి పాన్ పెట్టి దానిలో నాలుగు స్పూన్ల మెంతులు వేసి డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే పాన్ లో నాలుగు స్పూన్ల సోంపు గింజలు, నాలుగు స్పూన్ల ఆవిసే గింజలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే పాన్ లో నాలుగు స్పూన్ల నువ్వులను కూడా వేసి వేగించి పక్కన పెట్టుకోవాలి. .
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని వేగించి పెట్టుకున్న మెంతులు, సోంపు గింజలు, అవిస గింజలు, నువ్వులు వేసి మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని ఒక డబ్బాలో నింపి స్టోర్ చేసుకోవాలి. ప్రతిరోజు ఒక గ్లాసు గోరువెచ్చ నీటిలో అర స్పూన్ పొడి వేసి బాగా కలిపి తాగాలి. ఈ నీటిని ఉదయం పరగడుపున తాగితే మంచి ఫలితాన్ని పొందవచ్చు. .
జీవక్రియ రేటు పెరిగి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. అలాగే తినాలనే కోరికను తగ్గిస్తుంది. దాంతో బరువు తగ్గుతారు. అలాగే ఈ డ్రింక్ తీసుకోవడం వలన రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ డ్రింక్ ని తీసుకోవచ్చు. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.
ఒత్తిడి, ఆందోళన వంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి కాస్త ఓపికగా ఈ పొడిని తయారు చేసుకొని వాడి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి. కాస్త శ్రద్ద పెట్టి మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. కాబట్టి ఈ పొడిని వాడటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ