Devotional

Parijatham Plant:పారిజాతం చెట్టు మీ ఇంట్లో ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే ఇది తెలుసుకోండి

Parijat Leaves & Flowers: పారిజాతం చెట్టు మీ ఇంట్లో ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే ఇది తెలుసుకోండి..ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది పారిజాతం చెట్టును ఇంటిలో పెంచుకుంటున్నారు. పారిజాతం చెట్టు మొత్తంను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

పారిజాతం పువ్వు దేవత ఆరాధనలో మరియు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పారిజాతం పువ్వు గురించి మనలో చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి ముందుగా వాటి గురించి తెలుసుకున్నాక ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఒలేసియే కుటుంబానికి చెందిన పారిజాతం పువ్వులు మంచి సువాసనగల తెల్లని పువ్వుల చెట్టు.

ఇది అక్టోబరు, నవంబరు, డిసెంబరు మాసాలలో విరివిగా పుష్పిస్తుంది. ఈ పువ్వులు రాత్రి పూట వికసించి, ఉదయానికి రాలిపోయి చెట్టు కింద తెల్లని తివాచి పరచినట్లు కనిపిస్తాయి. సాధారణంగా కింద పడిన పూలను పూజకు వాడరు. అయితే, పారిజాత పుష్పాల విషయంలో మినహాయింపు ఉంది. ఈ చెట్టు పూలు కింద పడినా, వాటి పవిత్రత ఏమాత్రం చెడదు.

రాలిన పువ్వులను దేవునికి పెట్టవచ్చు కింద పడిన దోషం ఉండదు అలాగే రాలిన పువ్వులు దేవునికి పెట్టాలని కొంతమంది చెట్టు నుండి పువ్వులను దులుపుతారు ఆలా అసలు చేయకూడదు. సహజసిద్ధంగా రాలిన పువ్వులను మాత్రమే పూజకు ఉపయోగించాలి. ఎందుకంటే పారిజాతం పువ్వులకు నేను ఇస్తే తప్ప నా నుండి ఎవరు తీసుకోకూడదు అనే వరం ఉంది.

పారిజాతం చెట్టు తపస్సు చేసి వరాన్ని పొందింది. అందువల్ల పారిజాతం పువ్వులను కింద రాలినవి ఏరి పూజ చేయటానికి ఉపయోగించాలి. అయితే కింద పడిన ఏ పువ్వు పూజకు పనికిరాదు. కానీ పారిజాతం పువ్వు మాత్రమే పూజకు పనికివస్తుంది అంతేకాక చాలా మంది పారిజాతం పువ్వులు రాలిపోతాయని చెట్టు కింద వస్త్రం చాప వంటివి వేస్తూ ఉంటారు.

ఆలా వేయకూడదు. కింద పడిన పువ్వులను మాత్రమే పూజకు ఉపయోగించాలి. అవసరమైతే పారిజాతం చెట్టు కింద ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవచ్చు. పారిజాతం భూ స్పర్శ,మృత్తికా స్పర్శ,జల స్పర్శ,హస్త స్పర్శ స్వామి యొక్క స్పర్శ ఉండాలి. ఇలా 5 స్పర్శాలతో పారిజాతం పంచ మహా పాతకాలను పోగొడుతుందని శాస్త్రం చెప్పుతుంది. పారిజాతం పువ్వును అన్ని దేవుళ్ళకు పెట్టవచ్చు. పారిజాతం పువ్వుల గురించి ప్రస్తావన మనకు భాగవతంలో కనిపిస్తుంది

నారదుడు పారిజాత పుష్పాన్ని తీసుకువచ్చి రుక్మిణీ దేవికి అందించడం అది చూసి సత్యభామకు కోపం రావటం ఆ కోపాన్ని తీర్చడం కోసం పారిజాతం చెట్టు ఇంట్లో నాటు తనాని కృష్ణుడి ప్రతిజ్ఞ చేయటం ఆ విధంగా దేవతలతో యుద్ధం చేసి దేవ లోకం నుండి భూలోకానికి తెచ్చి సత్యభామ ఇంటి పెరట్లో నాటటం వంటి విషయాలు మనకు తెలుసు.

పారిజాత వృక్షం దేవలోకానికి చెందినది. కాబట్టి దేవలోకానికి చెందిన పారిజాతం చెట్టు యొక్క పువ్వు భూమికి తాకకపోటే భూలోకానికి సంబంధించిన పువ్వు కాకుండా దేవలోకానికి సంబంధించిన పువ్వు అవుతుంది.అందువల్ల భూమికి తాకిన తరువాత ఆ పువ్వుతో దేవునికి పూజలు చేస్తారు.

పారిజాతం పువ్వును నైట్ జాస్మిన్ అని పిలుస్తారు. పారిజాతం చెట్టు దాని భాగాలను ఆయుర్వేదంలో చాలా సంవత్సరాల నుండి ఉపయోగి స్తున్నారు. పారిజాతం పువ్వులో బలమైన ఆర్థరైటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు శక్తివంతమైన అనాల్జేసిక్, లక్షణాలు ఉండుట వలన ఎన్నో రకాల ఆయుర్వేద మందులలో వాడుతున్నారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ