Devotional

Silver Ring:ఈ రాశుల వారికి వెండి ఉంగరం ఓ వరం.. పెట్టుకుంటే డబ్బే డబ్బు.. ..

Silver Ring:బంగారం మాదిరిగానే వెండి ఉంగరం ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఏ రాశి వాళ్ళు ఏ వేలికి ఈ ఉంగరం ధరించడం వల్ల ఆందోళన, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

ఏ రాశి వారు వెండి ఉంగరం ధరిస్తే మంచిది..ఈ రాశి వారు పెట్టుకుంటే అదృష్టమే..మనలో చాలామంది జాతకాలు నమ్ముతూ ఉంటారు. కొంత మంది జాతకాలను అసలు నమ్మరు. ఇక ఇప్పుడు వెండి ఉంగరం ఏ రాశి వారు పెట్టుకుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.

కొంత మంది వెళ్లే ఉంగరాలను ఫ్యాషన్ కోసం పెట్టుకుంటూ ఉంటారు. కొంత మంది జాతకం ప్రకారం పెట్టుకుంటూ ఉంటారు. వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం వెండి ఉంగరం పెట్టుకుంటే అనేక రకాల శారీరక, భావోద్వేగా సమస్యలు తొలగిపోతాయని ఒక నమ్మకం.

అంతే కాకుండా మనసు కుదురుగా ఉంటుంది. కోపం తగ్గి ప్రశాంతత కలుగుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం వెండి బృహస్పతి, చంద్ర గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. వెండి ఉంగరాన్ని చిటికెన వేలుకు ధరిస్తే అద్భుతమైన ఫలితాలు కలుకుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా చిటికెన వేలుకు వెండి ఉంగరాన్ని ధరిస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

వెండికి ఎన్నో రోగాలను తగ్గించే శక్తి ఉంది. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది . దగ్గు, జలుబు, కీళ్ల నొప్పులు వంటివి తగ్గుతాయి. వెండి చంద్రునితో సంబంధం కలిగి ఉండుట వలన భావోద్వేగాల మీద ప్రభావాన్ని చూపి మానసికంగా ప్రశాంతత కలిగేలా చేస్తుంది.

ఒత్తిడి, మానసిక సమస్యలు లేకుండా చేస్తుంది. జీవితం హ్యాపీగా ఉండేలా చేస్తుంది. అయితే వెండి ఉంగరాలు కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వారికి మంచి ఫలితాలను అందిస్తుంది.

అయితే వృషభ రాశి, తులా రాశి వారు కూడా వెండి ఉంగరాలను ధరించవచ్చు, అయితే కొన్ని రాశుల వారు వెండి ఉంగరాలను అస్సలు ధరించకూడదు. మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి వారు పొరపాటున కూడా వెండి ఉంగరాలను ధరించకూడదు. ఒకవేళ ధరిస్తే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ