Devotional

Visiting Temple:రోజూ గుడికి వెళితే మీ జీవితంలో వచ్చే మార్పులు ఇవే..

Benefits Of Visiting Temples: కొందరు ప్రతిరోజూ దేవాల‌యానికి వెళుతుంటారు. మరికొందరు ప‌ర్వ‌దినాల్లో మాత్రమే ఆలయాన్ని సందర్శిస్తారు. రోజూ ఆలయాన్ని ఎందుకు సందర్శించాలి? ఆలయ దర్శనంతో కలిగే ప్రయోజనాలు ఇవే.

మనలో చాలా మంది గుడికి వెళ్ళుతు ఉంటారు. ఆడ,మగ అనే తేడా లేకుండా వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరూ గుడికి వెళ్ళుతు ఉంటారు. మనలో చాలా మందికి గుడికి ఎందుకు వెళ్ళాలి అనే విషయంలో క్లారిటీ ఉండదు.

అందరూ వెల్లుతున్నారు కాబట్టి వెళ్ళుతు ఉంటారు. కొంతమంది గుడికి వెళ్ళటానికి కారణం తెలిసే వెళ్ళతారు. ఇప్పుడు గుడికి ఎందుకు వెళ్ళాలి అనుకొనేవారు ఈ ఆర్టికల్ చదివితే అర్ధం అవుతుంది.

గుడికి వెళ్ళటం వెనక ఒక శాస్త్రీయ కారణం ఉంది. మన దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. అయితే అవన్నీ వైదిక దేవాలయాల పరిగణనలోకి రావు. నియమాలను పాటించి, నిర్దుష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే గురువులు పరిగణిస్తారు.

అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెందాయి. ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి. స్థలమహత్యాన్ని సంతరించుకున్నాయి.

భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించాలి. ఇంకా అర్ధమయ్యేట్లు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాసయ్యేచోట ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి.

అందుకే అలాంటి గుళ్ళలో అడుగు పెట్టగానే తనువూ, మనసూ ప్రశాంతత పొందుతాయి.దవాలయ గర్భగృహంలో ఉత్క్రుష్టమైన ఆకర్షణా తరంగాలు కేంద్రీకృతమైన చోట మూలవిరాట్టును నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన తామ్ర పత్రాన్ని (రాగి రేకు) నిక్షిప్తం చేసి ఉంచుతారు.

రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది. ఆవిధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది. అందువల్ల రోజూ గుడికి వెళ్ళాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ