Hair Fall Tips:మీ జుట్టు రాలుతుందని బాధపడుతున్నారా..అవసరమే లేదు ఈ ప్యాక్ వేస్తే ఊడిన జుట్టు కంటే డబుల్ పెరుగుతుంది
Amla And Henna Hair Fall:మీ జుట్టు రాలుతుందని బాధపడుతున్నారా.. అవసరమే లేదు ఈ ప్యాక్ వేస్తే ఊడిన జుట్టు కంటే డబుల్ పెరుగుతుంది. అసలు బాధ పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పే చిట్కా దాదాపుగా జుట్టుకి సంబందించిన అన్ని రకాల సమస్యలను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
మారిన జీవనశైలి పరిస్థితి, ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, కెమికల్స్ ఎక్కువగా ఉండే ఉత్పత్తులను ఎక్కువగా వాడటం వంటి కారణాలతో జుట్టు రాలే సమస్య,తెల్లజుట్టు సమస్య వంటివి ఎక్కువగా వస్తున్నాయి. వీటితో పాటు చుండ్రు కూడా వచ్చేస్తుంది.
ఈ సమస్యల నుండి బయట పడటానికి మార్కెట్ లో దొరికే ఉత్పత్తుల మీద ఆధారపడకుండా ఇంటి చిట్కాల ద్వారా చాలా సమర్ధవంతంగా తగ్గించు కోవచ్చు. ఒక మిక్సీ జార్ లో శుభ్రంగా కడిగిన 5 మందార ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత గుప్పెడు గోరింటాకును శుభ్రంగా కడిగి వేయాలి.
ఆ తర్వాత చిన్న బీట్ రూట్ లో సగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ ఉసిరి పొడి, ఒక గుడ్డు తెల్లసొన, 3 స్పూన్ల ఆలోవెరా జెల్, 3 స్పూన్ల పెరుగు, అరచెక్క నిమ్మరసం వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించాలి.
రెండు గంటలు అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తూ ఉంటే చుండ్రు,జుట్టు రాలే సమస్య, తెల్ల జుట్టు సమస్య తగ్గటమే కాకుండా పొడిగా మారిన జుట్టు తేమగా మారుతుంది. జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ